Health Tips: ఈ విటమిన్ లోపిస్తే శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించదు.. ఎందుకంటే..?
Health Tips: విటమిన్ B12 లోపం అనేది ఒక సాధారణ సమస్య.
Health Tips: విటమిన్ B12 లోపం అనేది ఒక సాధారణ సమస్య. కానీ దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీని లోపం వల్ల అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడతాయి. విటమిన్ B12 లోపం అనేది శరీరంలో తగినంత ఎర్ర రక్త కణాలు లేనప్పుడు ఏర్పడే పరిస్థితి. దీనివల్ల ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి. దీని కారణంగా ఆక్సిజన్ శరీరంలోని మిగిలిన భాగాలకు వెళుతుంది. ఎర్ర రక్త కణాలు లేకుండా కణజాలాలు లేదా అవయవాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. దీంతో శరీరం సరిగ్గా పనిచేయదు. US జనాభాలో దాదాపు 6 శాతం నుంచి 20 శాతం మంది ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.
ఆహారంలో బి12 దొరకడం చాలా అరుదు. ఇది జంతు ఉత్పత్తుల నుంచి లభ్యమవుతుంది. శుభవార్త ఏంటంటే మానవులకు రోజుకు 2.4 మైక్రోగ్రాముల B12 మాత్రమే అవసరం. శరీరంలో తగినంత మొత్తంలో B12 లేదంటే జీవన నాణ్యత తీవ్రంగా ప్రభావితమవుతుంది. B12 లోపం ప్రారంభ లక్షణం అలసట. ఇది రోజువారీ పనులను ప్రభావితం చేస్తుంది. మిగిలిన లక్షణాలు నాడీ సంబంధితమైనవి. ఇందులో అతిసారం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, పెరిగిన హృదయ స్పందన రేటు, చిరాకు, నడవడానికి ఇబ్బంది, చేతులు, కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు మొదలైనవి ఉంటాయి.
B12 లోపం చికిత్స
B12 లోపం లక్షణాలను అనుభవిస్తున్నట్లయితే పరీక్ష కోసం వైద్యుని వద్దకు వెళ్లాలి. చికిత్స రకం, కోలుకునే కాలం B12 లోపం తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం పట్టవచ్చు. కానీ సరైన చికిత్సతో ఇది చాలా వరకు సాధ్యమవుతుంది. ఇది కాకుండా విటమిన్ బి12 ఫోలిక్ యాసిడ్ మాత్రల, ఇంజెక్షన్ల ద్వారా కూడా చికిత్స జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్ కోసం నారింజ, నారింజ రసం, బచ్చలికూర, సోయాబీన్స్, ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.