Uric Acid Problem: బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు మొదలవుతాయి.. ఇంట్లో లభించే ఈ వస్తువులతో తొలగించుకోవచ్చు..!
Uric Acid Problem: బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
Uric Acid Problem: బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా దీనివల్ల చేతి వేళ్లలో, కీళ్లలో నొప్పులు మొదలవుతాయి. దీంతో ఏ పని చేయడానికి పటుత్వం ఉండదు. కొన్నిసార్లు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతారు. మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాల వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. దీనిని తొలగించుకోవా లంటే హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో కూడా కొన్ని పద్దతులను ఉపయోగించి సులువుగా యూరిక్ యాసిడ్ తొలగించుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపో యిన యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తుంది. ప్రతి రోజూ కనీసం ఒక ఉసిరికాయను తినడం అలవాటు చేసుకోవాలి. ఎండిన కొత్తిమీర ఆకులు శరీరం నుంచి యూరిక్ యాసిడ్ స్ఫటికాలను తొలగించ డంలో పనిచేస్తాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిన వ్యక్తులు కొత్తిమీర టీ లేదా కొత్తిమీర నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే యూరిక్ యాసిడ్ స్ఫటికాలను తొలగించడంలో వేప ఎంతగానో దోహదం చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది వాపును తగ్గిస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ సమస్యను నయం చేస్తుంది.
రోజువారీ ఆహారంలో చేపలు చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో పనిచేస్తాయి. మూత్రపిం డాలు పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఫలితంగా యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటికి పోతుంది. కరక్కాయలో కూడా మంచి డిటాక్సిఫై లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్, యూరిక్ యాసిడ్‌లను బయటకు పంపుతుంది. జీర్ణక్రియకు సక్రమంగా చేస్తుంది. దీని సాయంతో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడొచ్చు.