Weak Kidneys: ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు బలహీనమయ్యాయి.. పట్టించుకోకుంటే అంతే సంగతులు..!
Weak Kidneys: కిడ్నీలు సహజంగా వాటి శుభ్రతను అవి కాపాడుకుంటాయి. కానీ ఆధునిక కాలంలో మనం తీసుకునే ఆహారం పానీయాలలో చాలా రకాల రసాయనాలు ఉంటున్నాయి.
Weak Kidneys: కిడ్నీలు సహజంగా వాటి శుభ్రతను అవి కాపాడుకుంటాయి. కానీ ఆధునిక కాలంలో మనం తీసుకునే ఆహారం పానీయాలలో చాలా రకాల రసాయనాలు ఉంటున్నాయి. వీటిని తొలగించడంలో అవి అదనపు ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. దీనివల్ల అవి రోజు రోజుకి బలహీనమవుతున్నాయి. కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించి వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్లాలి. అప్పుడే చికిత్స చేయడం సులభం అవుతుంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
అలసట, తక్కువ శక్తి
బలహీనమైన కిడ్నీలు వ్యర్థాలను తొలగించలేవు. దీనివల్ల ఒక వ్యక్తి త్వరగా అలసిపోతాడు. బలహీనంగా మారిపోతాడు.
మూత్ర విసర్జన సమస్యలు
కిడ్నీలు బలహీనంగా మారినప్పుడు మూత్రంలో మార్పులు ఏర్పడుతాయి. మూత్రం పరిమాణం తగ్గుతుంది. మూత్రం వెళ్ళడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మూత్రం ముదురు రంగులోకి మారుతుంది.
కడుపులో నొప్పి, వాపులు
బలహీనమైన మూత్రపిండాలు కడుపులో నొప్పి, వాపుకు కారణమవుతాయి. ఇది మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల సంభవిస్తుంది.
నిద్ర, ఆకలిలో మార్పులు
కిడ్నీలు బలహీనంగా మారినప్పుడు ఒక వ్యక్తి నిద్ర, ఆకలిలో మార్పులు ఏర్పడుతాయి. నిద్రలేమి, ఆకలిని కోల్పోవడం జరుగుతుంది.
వాంతులు
కిడ్నీలు బలహీనంగా మారినప్పుడు ఒక వ్యక్తి వాంతులు, అసౌకర్యానికి గురవుతాడు. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది.
మూత్రం వాసన
కిడ్నీలు బలహీనంగా మారినప్పుడు శరీరంలోని రసాయనాలు బయటికి వెళ్లవు. దీనివల్ల మూత్రం దుర్వాసన వస్తుంది.