రక్తంలో హిమోగ్లోబిన్‌ లేకుంటే చాలా అనర్థాలు.. ఈ డ్రై ఫ్రూట్స్ బెస్ట్‌..!

Health Tips: రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే శరీరంలో బలహీనత మొదలవుతుంది.

Update: 2022-10-06 13:30 GMT

రక్తంలో హిమోగ్లోబిన్‌ లేకుంటే చాలా అనర్థాలు.. ఈ డ్రై ఫ్రూట్స్ బెస్ట్‌..!

Health Tips: రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే శరీరంలో బలహీనత మొదలవుతుంది. రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కష్టం అవుతుంది. హిమోగ్లోబిన్ అనేది రక్త కణాలలో ఉండే ఐరన్‌ ఆధారిత ప్రోటీన్. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి పనిచేస్తుంది. దీని కోసం మీరు కొన్ని ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే హిమోగ్లోబిన్ లోపాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ హిమోగ్లోబిన్ సృష్టించడానికి చాలా పనిచేస్తాయి. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం.

వాల్‌నట్

వాల్‌నట్‌లో పోషకాలకి కొరత ఉండదు. ప్రతిరోజు వాల్‌ నట్‌లని తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ కొరత ఉండదు. అంతేకాదు శరీరం చురుకుగా ఉంటుంది.

పిస్తా

పిస్తాపప్పు రుచి చాలా మందిని ఆకర్షిస్తుంది. పిస్తాపప్పులో 1.11 mg ఐరన్ ఉంటుంది. మీరు దీన్ని డైట్‌లో చేర్చుకుంటే ప్రతిరోజు శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని తొలగిస్తుంది.

జీడిపప్పు

జీడిపప్పును అనేక స్వీట్లు, వంటకాలలో ఉపయోగిస్తారు. ఇందులో 1.89 mg ఐరన్‌ దాగి ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపాన్ని అధిగమించడానికి ఇది సమర్థవంతమైన పరిష్కారం.

బాదం

మెదడుకు పదును పెట్టడానికి ప్రతిరోజూ బాదంపప్పులు తినాలని వైద్యులు చెబుతారు. అయితే శరీరం హిమోగ్లోబిన్ లోపం వల్ల బలహీనంగా మారినట్లయితే ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదం తినాలి. ఇది మంచి ఎంపికని చెప్పవచ్చు.

Tags:    

Similar News