Hemoglobin: రక్తంలో హిమోగ్లోబిన్ లోపిస్తే చాలా ప్రమాదం.. ఈ డ్రై ఫ్రూట్స్ డైట్‌లో ఉండాల్సిందే..!
Hemoglobin Deficiency:రక్తంలో హిమోగ్లోబిన్ లోపిస్తే శరీరంలో బలహీనత మొదలవుతుంది.
Hemoglobin Deficiency: రక్తంలో హిమోగ్లోబిన్ లోపిస్తే శరీరంలో బలహీనత మొదలవుతుంది. రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టం అవుతుంది. హిమోగ్లోబిన్ అనేది రక్త కణాలలో ఉండే ఐరన్ ఆధారిత ప్రోటీన్. శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి ఇది పనిచేస్తుంది. దీని కోసం మీరు కొన్ని ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే హిమోగ్లోబిన్ లోపాన్ని తొలగించడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితిలో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ప్రయోజనకరంగా ఉంటాయో తెలుసుకుందాం.
వాల్‌నట్
వాల్‌నట్స్‌లో పోషకాల కొరత ఉండదు. కొన్ని ఒలిచిన వాల్‌నట్‌ల నుంచి శరీరానికి దాదాపు 0.82 మిల్లీగ్రాముల ఐరన్ అందుతుంది. హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్లయితే ప్రతిరోజూ వాల్‌నట్‌లను తీసుకోవాలి.
పిస్తాపప్పు
పిస్తాపప్పు రుచి చాలా మందిని ఆకర్షిస్తుంది. కొన్ని పిస్తాపప్పులో 1.11 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. మీరు దీన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. దీని కారణంగా హిమోగ్లోబిన్ లోపం తొలగిపోతుంది.
జీడిపప్పు
జీడిపప్పు అనేక స్వీట్లు, వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే కొన్ని జీడిపప్పులో 1.89 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుందని గుర్తుంచుకోండి. హిమోగ్లోబిన్ లోపాన్ని తొలగించడానికి ఇది ప్రభావవంతమైన మార్గమని చెప్పవచ్చు.
బాదంపప్పు
మెదడు షార్ప్‌గా మారాలంటే ప్రతిరోజూ బాదంపప్పు తినాలని నిపుణులు చెబుతారు. అయితే శరీరం హిమోగ్లోబిన్ లోపం వల్ల బలహీనంగా మారినట్లయితే ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం బాగా ఉపయోగపడుతుంది.