H3N2 వైరస్ దగ్గు తగ్గకపోతే జాగ్రత్త.. వెంటనే ఈ టెస్ట్‌ చేయించాలి లేదంటే చాలా ప్రమాదం..!

H3N2 Virus: దేశంలో ఇన్‌ఫ్లూయెంజా ప్రభావం కొనసాగుతోంది.

Update: 2023-03-23 14:00 GMT

H3N2 వైరస్ దగ్గు తగ్గకపోతే జాగ్రత్త.. వెంటనే ఈ టెస్ట్‌ చేయించాలి లేదంటే చాలా ప్రమాదం..!

H3N2 Virus: దేశంలో ఇన్‌ఫ్లూయెంజా ప్రభావం కొనసాగుతోంది. H3N2 వైరస్ కేసులు తగ్గడం లేదు. ఇప్పటికే 7 మరణాలు సంభవించాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వైరస్‌ సోకుతోంది. H-3N2 దగ్గు-జలుబు, జ్వరం, తలనొప్పికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా వారాల పాటు దగ్గు ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు సంకేతంగా వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో కొన్ని పరీక్షలు చేయించుకోవడం అవసరం. వాటి గురించి తెలుసుకుందాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కొన్ని సందర్భాల్లో న్యుమోనియాకు కారణం అవుతుంది. ఈ పరిస్థితిలో రెండు మూడు వారాల పాటు దగ్గు కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. CT స్కాన్ లేదా ఛాతీ X- రే తీయించాలి. తద్వారా వ్యాధి నిర్ధారణ చేసి ప్రమాదాన్ని నివారించవచ్చు. అయితే చాలా తక్కువ మంది రోగులలో న్యుమోనియా బయటపడతుంది. చాలా మందిలో లక్షణాలు వాటంతట అవే మెరుగవుతున్నాయి.

ఫ్లూ లక్షణాల కారణంగా చాలా మంది రోగులు సొంతంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఇలా చేయకూడదు. సాధారణ దగ్గు, జలుబు ఉంటే దానంతటదే నయమవుతుంది. కానీ సమస్య పెరిగినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. సొంత మందులు చాలా హాని కలిగిస్తాయి. అనేక సందర్భాల్లో యాంటీబయాటిక్స్ అధికంగా ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీని కారణంగా శరీరంపై మందులు పనిచేయకుండా పోతున్నాయి. రోగి చికిత్సలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ఏదైనా ఔషధం తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Tags:    

Similar News