How to Stop Snoring: గురక సమస్యకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి
How to Stop Snoring: నిద్రలో గురకపెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది.
How to Stop Snoring: నిద్రలో గురకపెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. గురకే కదా దీని వల్ల కలిగే అనర్థమేంటని అందరూ అనుకుంటుంటారు కానీ గురకపెట్టే వారికి సమస్య తీవ్రత ఎలా ఉంటుందో ఆ గురక వల్ల పక్కవారు కూడా అన్నే సమస్యలు ఎదుర్కొంటుంటారు. గురకపెట్టేవారు హాయిగా పడుకుంటారు కానీ పక్కవారు మాత్రం నిద్రకు దూరమవ్వాల్సిందే. గురక తగ్గించుకునేందకు మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే చిన్న పాటి చిట్కాల వల్ల ఈ గురక సమస్య నుంచి మనం బయటపడవచ్చు. గురక సమస్య వేధిస్తుందని వైద్యులను ఆశ్రయించడం కంటే ఇంటి చిట్కాలను కొన్నింటిని పాటిస్తే మంచి ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. మరిగే నీటిలో 4లేదా5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిదురపోయే ముందు 10ని" పాటు ముక్కుద్వారా ఆవిరి పీల్చాలి.
2. ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడిచేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాలలో పోసి పీల్చుతుంటే గురక తగ్గుతుంది.
3. 1/2టీ స్పూను యాలకుల చూర్ణంను ఒక గ్లాసు వేడీనీటిలో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.
4. రెండు టీ స్పూనుల పసుపుపొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.
5. గ్లాసు నీటిలో 1—2 పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి.
6. కొద్దిగా పిప్పర్ మెంట్ ఆయిల్ ను చేతివేళ్ళకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది.
7. 1/2 టీ స్పూను ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూను తేనె కలిపి రాత్రి నిదురపోయేముందు తాగాలి.