Iron Deficiency: ఇలాంటి లక్షణాలు ఉంటే అది ఐరన్ లోపం..!

Iron Deficiency: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కచ్చితంగా ఖనిజాలు కావాలి.

Update: 2022-09-26 07:33 GMT

Iron Deficiency: ఇలాంటి లక్షణాలు ఉంటే అది ఐరన్ లోపం..!

Iron Deficiency: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కచ్చితంగా ఖనిజాలు కావాలి. వాటిలో ఒకటి ఐరన్. దీనివల్ల శరీరం సక్రమంగా పనిచేస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాలు వృద్ధికి సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే రక్తహీనతకు గురవుతారు. ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐరన్ లోపం వల్ల కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. అన్ని వేళలా అలసిపోయినట్లు కనిపించడం.

2. నాలుక తరచుగా పొడిబారడం

3. చాలా దాహంగా అనిపించడం.

4. అన్ని సమయాలలో బలహీనంగా ఉండటం

5. అధిక జుట్టు రాలడం

6. గొంతు నొప్పి పెరగడం

7. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఏ వయస్సులో ఎంత ఐరన్ అవసరం..?

స్త్రీలు, పురుషులలో ఐరన్‌ అవసరం భిన్నంగా ఉంటుంది. పిల్లల కంటే యువతకు ఇది ఎక్కువ అవసరం. స్త్రీలకి పురుషుల కంటే ఎక్కువ ఐరన్ అవసరం.

4 నుంచి 8 సంవత్సరాల వయస్సు పిల్లలకి - రోజు 10 mg ఐరన్ అవసరం.

9 నుంచి 13 సంవత్సరాల వయస్సు - రోజు 8 mg ఐరన్‌ అవసరం.

19 నుంచి 50 సంవత్సరాలు - రోజు 18 mg ఐరన్‌ అవసరం.

ఐరన్-రిచ్ ఫుడ్స్

బాదం , జీడిపప్పు , వాల్‌నట్ , తులసి , బెల్లం , వేరుశెనగ , నువ్వులు , దుంప, ఉసిరి , జామున్ , పిస్తా , నిమ్మకాయ , దానిమ్మ, ఆపిల్ , పాలకూర, ఎండుద్రాక్ష, అంజీర్, జామ , అరటిపండు

Tags:    

Similar News