Mobile Side Effects: పడుకునేటప్పుడు మొబైల్‌ ఎంత దూరంలో ఉండాలి.. దగ్గరగా ఉంటే జరిగే నష్టాలివే..!

Mobile Side Effects: మొబైల్ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది.

Update: 2023-03-08 14:30 GMT

Mobile Side Effects: పడుకునేటప్పుడు మొబైల్‌ ఎంత దూరంలో ఉండాలి.. దగ్గరగా ఉంటే జరిగే నష్టాలివే..!

Mobile Side Effects: మొబైల్ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. పొద్దున లేవగానే ఫోన్ చూడటానికి అడిక్ట్ అయిపోయారు. ఇది మాత్రమే కాదు ప్రజలు తినేటప్పుడు, తాగేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా ఫోన్‌లను వదలడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మొబైల్‌కి బానిసలుగా మారారు. కానీ ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. జాగ్రత్తగా ఉండకపోతే చాలా పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

కొంతమందికి దిండు కింద మొబైల్ పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీని వల్ల చాలా నష్టం జరుగుతుంది. నిద్రపోయేటప్పుడు మొబైల్‌ని ఎంత దూరంలో ఉంచాలి అనే విషయం చాలా మందికి తెలియదు. మొబైల్‌ని దగ్గర పెట్టుకుని నిద్రపోయే వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది. 90 శాతం మంది టీనేజర్లు, 68 శాతం మంది పెద్దలు మొబైల్‌తో నిద్రపోతున్నారని ఒక నివేదికలో పేర్కొంది.

మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ రాకుండా ఉండాలంటే దానిని పడుకునేటప్పుడు దూరంగా ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల మొబైల్ నుంచి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ పవర్ తగ్గుతుంది. దీనివల్ల మీరు రేడియేషన్‌కి గురికారు. WHO ప్రకారం కండరాల నొప్పి, తలనొప్పి , సంతానోత్పత్తి కూడా ప్రభావితమవుతుంది. మొబైల్స్ వెదజల్లే బ్లూ లైట్ నిద్రను కలిగించే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని కారణంగా నిద్రపోవడం కష్టంగా మారుతుంది. జీవ చక్రం చెదిరిపోతుంది.

Tags:    

Similar News