Health Tips: మధుమేహ రోగులు అన్నం ఎలా తినాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

Health Tips: దేశంలో రోజు రోజుకి డయాబెటీస్‌ పేషెంట్లు పెరిగిపోతున్నారు.

Update: 2024-03-06 11:30 GMT

Health Tips: మధుమేహ రోగులు అన్నం ఎలా తినాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

Health Tips: దేశంలో రోజు రోజుకి డయాబెటీస్‌ పేషెంట్లు పెరిగిపోతున్నారు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనిని మందుల కన్నా డైట్‌ ద్వారా అదుపులో పెట్టుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నట్లయితే తినడం,తాగడం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్‌ పేషెంట్లు అన్నం తినడం తగ్గించాలి. దీనివల్ల షుగర్‌ అదుపులో ఉంటుంది. అయితే ఇది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

డయాబెటీస్‌ పేషెంట్లు అన్నం ఎలా తినాలి..?

అన్నం కుక్కర్‌కు బదులుగా ఓ గిన్నెల వండాలి. వీలైనంత ఎక్కువ నీటిని పోసి వండుకోవాలి. ఇది ప్రారంభ కంటెంట్‌ను తగ్గిస్తుంది. ఎందుకంటే బియ్యంలో గ్లెసెమిక్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్నం తినేటప్పుడు ఫైబర్, ప్రోటీన్ ఉండే గుడ్లు, పనీర్, చికెన్, పెరుగు, కొన్ని తాజా కూరగాయలతో వండిన కూరలు ఉండాలి. వీటితో కలుపుకొని తినాలి.

డయాబెటీస్‌ పేషెంట్లు అన్నం తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ అన్నం తినడం తగ్గించాలి. అన్నం తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయడం ముఖ్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. 9 నుంచి 10 గంటల క్రితం వండిన అన్నం తినాలి.

Tags:    

Similar News