Health Tips: గుండెకు మంచిదని వీటిని అతిగా తింటున్నారా?హార్ట్ ఎటాక్ వస్తుందట జాగ్రత్త.!

Health Tips :కొన్ని ఫుడ్స్ గుండెకు మేలు చేసినా, వాటిని అతిగా తీనడం వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అవి ఏంటో తెలుసుకుందాం.

Update: 2024-06-17 14:00 GMT

Health Tips: పని చేసినంత వరకూ గుండె గురించి అసలు పట్టించుకోము. ఎప్పుడైనా మొరాయిస్తే ముందే జాగ్రత్త పడితే బాగుండేది కదా అని బాధపడుతుంటాం. పరిస్థితి అంతవరకు రాకుండా ముందే మేల్కోంటే మంచిది. ఈ విషయం మంచి ఆహారం జీవితాంతం తోడుంటుంది. అయితే మీరు తీసుకునే ఆహారం గుండెకు మంచిదని అతిగా తింటున్నారా?అయితే ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. గుండెకు మంచివని అతిగా తింటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందట. ఆ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం.

నెయ్యి:

నెయ్యిలో మంచి కొవ్వులు లభిస్తాయి. నెయ్యిని తప్పకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ మనం అవసరమైన దానికంటే ఎక్కువ నెయ్యి తీసుకుంటే, అది గుండె సంబంధిత సమస్యలను త్వరగా పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ రెండూ ఉంటాయి. ఇవి గుండెపోటుకు కారణమవుతాయి.

వాల్నట్:

వాల్‌నట్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాల్నట్స్ ప్రతిరోజూ తినాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ వాల్ నట్‌లో 64శాతం నూనె ఉంటుంది. వీటిని గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రోజూ వాల్ నట్ తింటే, హార్ట్ బ్లాక్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని మితంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉందని చెబుతున్నారు.

చేప, చికెన్:

చేపలు, చికెన్ లో లీన్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీరుస్తాయి. కానీ వీటిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇది మన గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సాల్మన్ చికెన్‌ను మితంగా తినడం మంచిది. వాటిని డీప్ ఫ్రై చేయడానికి బదులుగా గ్రిల్ చేసి లేదా ఉడికించి తినడం మంచిది.

బాదం:

బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎందుకంటే బాదంలో 58 శాతం కొవ్వు ఉంటుంది. ఇది క్రమంగా మన గుండెను దెబ్బతీస్తుంది. మీరు రోజుకు నాలుగు నుండి ఐదు బాదంపప్పులను మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

అవిసె గింజలు:

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ ఈ విత్తనాలు గుండె రోగులకు హానికరం. ఎందుకంటే ఇందులో నూనె ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మితంగా తీసుకుంటే ఎలాంటి హాని ఉండదు.

Tags:    

Similar News