Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఫుడ్స్ తింటే బ్రెయిన్ షార్ప్..!
Breakfast: బాడీ ఫిట్‌గా ఉండాలంటే మైండ్ కూడా ఫిట్‌గా ఉండాలి...
Breakfast: బాడీ ఫిట్‌గా ఉండాలంటే మైండ్ కూడా ఫిట్‌గా ఉండాలి. ఎందుకంటే మీ శరీరానికి ఏదైనా పని చేయాలనే ఆదేశాన్ని ఇచ్చేది మెదడు మాత్రమే. మీరు మీ మనస్సును కూడా ఆరోగ్యంగా ఉంచుకుంటే శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది. చాలా మంది తమ ఆహారం, పానీయాలపై శ్రద్ధ చూపరు. వీటి ప్రభావం మీ మెదడుపై ఎక్కువగా ఉంటుంది. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోతే మెదడు బలహీనంగా మారుతుంది. మంచి ఆహారాన్ని తీసుకుంటే అది షార్ప్‌గా అవుతుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
ఉదయం కాఫీ
మీరు ఉదయం అల్పాహారంలో కాఫీని చేర్చుకోవచ్చు. వాస్తవానికి ఇందులో చాలా కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాదు మెదడు చురుకుదనం పెరుగుతుంది. మీరు బాగా ఏకాగ్రత పొందగలుగుతారు.
ఆహారంలో పసుపు
పసుపు గురించి అందరికీ తెలిసిందే. ఇది మెదడు కణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు పసుపు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీన్ని అల్పాహారంలో ఉండేవిధంగా చూసుకోవాలి.
రోజూ గుడ్డు
గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో బి-6, బి-12 విటమిన్లు ఉంటాయి. అల్పాహారం కోసం గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. గుడ్డు ఉదయం మెదడును బలోపేతం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
నారింజ
మీరు ఆహారంలో నారింజను చేర్చుకోవచ్చు. ప్రతిరోజూ ఒక నారింజ తినవచ్చు. నారింజలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి అనేది మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచే ఒక పోషకం.
ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి.