Health Tips: బలహీనత, అలసటకి ఇవే పెద్ద కారణాలు..!
Health Tips: వేసవిలో అలసట, బలహీనత, తలతిరగడం వంటి అనేక సమస్యలు ఉంటాయి.
Health Tips: వేసవిలో అలసట, బలహీనత, తలతిరగడం వంటి అనేక సమస్యలు ఉంటాయి. అయితే వీటి వెనుక కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? వేసవిలో శరీరంలో ఎలక్ట్రోలైట్ లోపించడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. దీని వల్ల శరీరంలో నొప్పి, కండరాల నొప్పి, టెన్షన్ మొదలవుతాయి. ఈ పరిస్థితిలో మీకు అలసట, బలహీనత, తల తిరగడం వంటివి అనిపిస్తే అస్సలు విస్మరించకూడదు. అసలు వీటికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
1. మీ శరీరంలో తగినంత నీరు లేనప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. మీరు తగినంత నీరు తాగకపోతే మీ శరీరం డీహైడ్రేట్ కావచ్చు. ఈ పరిస్థితిలో మీరు బలహీనత, మైకము బారిన పడుతారు. అందువల్ల ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. డీ హైడ్రేషన్ చికిత్స చేయడానికి గ్లూకోజ్ మొదలైనవి తీసుకోవచ్చు.
2. మైగ్రేన్ అనేది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే ఒక రకమైన తలనొప్పి. కొన్నిసార్లు మైగ్రేన్ రాకముందే ప్రజలు కళ్లు తిరిగి పడిపోతారు. అందువల్ల తలనొప్పి, బలహీనత లేదా మైకము సమస్య గురించి పెద్దగా ఆలోచించకూడదు. తరచుగా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. తలనొప్పి వచ్చినప్పుడు అల్లం టీ తాగితే మంచి ఉపశమనం దొరుకుతుంది.
3. తక్కువ రక్తపోటు కారణంగా తలలో తేలికపాటి తలనొప్పి ఏర్పడుతుంది. రక్తపోటు పెరుగుదల మీ మెదడులో ఆకస్మిక మార్పులకు కారణమవుతుంది. తక్కువ రక్తపోటు కారణంగా మీకు మైకము, బలహీనత, అలసట వంటి సమస్యలు ఏర్పడుతాయి.
4. అలసట, బలహీనత, మైకము ఐరన్ లోపం లక్షణాలు కావొచ్చు. ఈ పరిస్థితిలో ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.