Rock Salt: రాతి ఉప్పుతో బోలెడు ప్రయోజనాలు..!
Rock Salt: పూర్వకాలంలో చాలామంది రాతి ఉప్పునే వినియోగించేవారు.
Rock Salt: పూర్వకాలంలో చాలామంది రాతి ఉప్పునే వినియోగించేవారు. అందుకే మన తాత, తండ్రులు ఆరోగ్యంగా జీవించారు. కానీ ఇప్పుడు రసాయనాలు కలిపిన ఉప్పు వాడటం వల్ల చాలామంది రోగాలపాలవుతున్నారు. ప్రజలు ఉపవాసంలో రాతి ఉప్పును ఎక్కువగా వాడేవారు. ఎందుకంటే ఈ ఉప్పు చాలా స్వచ్ఛమైనదిగా భావించేవారు. దీనిని తయారుచేయడానికి రసాయన ప్రక్రియ అవసరం ఉండదు. కానీ ఇప్పుడు వాడే ఉప్పుని తయారుచేయాలంటే అనేక రసాయన ప్రక్రియల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. దీని కారణంగా కాల్షియం, పొటాషియం మొదలైన ముఖ్యమైన పోషకాలు తగ్గుతాయి. ఈ కారణంగానే ఉపవాస సమయంలో రాతి ఉప్పును ఎక్కువగా వాడుతారు. దీని వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి.
రాతి ఉప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు రక్తపోటును నియంత్రించడంలో రాతి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. రాతి ఉప్పులో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా అలసిపోయేవారు రాతి ఉప్పును తీసుకుంటే రక్తపోటు సమస్య తగ్గి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. రాతి ఉప్పు కళ్లకు చాలా మేలు చేస్తుంది. రాతి ఉప్పు దృష్టి నష్టాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా మార్చడంలో రాక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. మీకు వాంతులు లేదా వికారం వంటి సమస్యలు ఉంటే రాళ్ల ఉప్పులో నిమ్మరసం కలిపి తాగండి. మంచి ఉపశమనం ఉంటుంది.