Dry Cough: పొడి దగ్గుతో ఇబ్బందిపడితే ఇలా ట్రై చేయండి.. మంచి ఉపశమనం ఉంటుంది..
Dry Cough: చలికాలం పొడిదగ్గుతో చాలామంది బాధపడుతారు. గొంతులో గరగరగా ఉండటం, ఒక్కోసారి శ్లేష్మంతో కూడిన దగ్గు రావడం, గొంతునొప్పి వంటివి ఏర్పడుతాయి.
Dry Cough: చలికాలం పొడిదగ్గుతో చాలామంది బాధపడుతారు. గొంతులో గరగరగా ఉండటం, ఒక్కోసారి శ్లేష్మంతో కూడిన దగ్గు రావడం, గొంతునొప్పి వంటివి ఏర్పడుతాయి. దగ్గు పెరిగినప్పుడు, పక్కటెముకలు కూడా బాధించడం ప్రారంభిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే అది TBకి కారణం అవుతుంది. అందుకే పొడిదగ్గు ఉన్నప్పుడు ఇంట్లోనే ఈ చిట్కాలను పాటించండి. మంచి ఉపశమనం దొరుకుతుంది.
1. గార్గిలింగ్
గార్గ్లింగ్ పొడి దగ్గుకు మాత్రమే కాకుండా గొంతులో నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి సుమారు 10 నిమిషాల పాటు పుక్కిలించండి. దగ్గు ఎక్కువగా ఉంటే రోజుకు 3 సార్లు చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.
2. పసుపు పాలు
పసుపులో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ కారణంగా అనేక వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. పొడి దగ్గు ఉన్న సమయంలో రాత్రిపూట గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది సహజసిద్ధమైన యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది.
3. తేనె
పొడి దగ్గు చికిత్సకు తేనె ఉత్తమ ఎంపికలలో ఒకటని చెప్పవచ్చు. బ్యాక్టీరియా వల్ల దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తేనెలో ఈ క్రిములను తొలగించే గుణాలు ఉన్నాయి. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా కొంచెం తేనె తినాలి. ఇలా చేయడం వల్ల గొంతులో తేమ ఏర్పడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
4. ఆవిరి
జలుబు లేదా దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఆవిరి పట్టడం ఉత్తమం. విపరీతమైన దగ్గు ఉన్నట్లయితే, ఆవిరిని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి. ఇది గ్రేట్ హోం రెమెడీ దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంతేకాదు చాలా తొందరగా ఉపశమనం దొరుకుతుంది.