Saunf: రోజూ ఒక స్పూన్ సోంపు తినండి.. నెల రోజుల్లో ఈ మార్పులు పక్కా
Saunf: భోజనం చేసిన తర్వాత సోంపు తినడం మనలో చాలా మంది చేసే పనే. హోటల్స్‌లో, విందుల్లో కూడా కచ్చితంగా సోంపును అందిస్తారు.
Saunf: భోజనం చేసిన తర్వాత సోంపు తినడం మనలో చాలా మంది చేసే పనే. హోటల్స్‌లో, విందుల్లో కూడా కచ్చితంగా సోంపును అందిస్తారు. అయితే సోంపు కేవలం సరదా కోసమే కాదండోయ్, ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్రమంతప్పకుండా ప్రతీ రోజూ సోంపు తీసుకోవడం వల్ల శరీంలో ఎన్నో మార్పులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా సోంపును తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* సోంపులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. దీంతో రక్తపోటు సమస్య దూరమవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* సోంపు తిన్న వెంటనే కడుపులో తేలికపడిన భావన కలగడం సాధారణం. ఇందులోని పోషక గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్ట్రిక్ ఎంజమై ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి ఎన్నో సమస్యలను దూరం చేయడంలో సోంపు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే సమస్యలకు సోంపు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైటో ఈస్ట్రోజన్ కారణంగా మహిళల్లో హార్మోన్లను క్రమబద్ధీకరణిస్తుంది. దీంతో పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* సోంపులో యాంటీ ఇన్‌ప్లమేటరీ, రోగ నిరోధక గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో తరచూ వ్యాధుల బారినపడకుండా ఉండడంలో ఉపయోగపడతాయి. ఆస్తమా, బ్రోంకైటిస్ , దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. కఫం సమస్యను దూరం చేస్తుంది.
* బరువు తగ్గడంలో కూడా సోంపు కీలక ఆత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసే కంటే ఒక గంట ముందు సోంపు తీసుకోవడం వల్ల తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
* నోట్లో నుంచి దుర్వాసన సమస్యతో బాధపడేవారికి కూడా సోంపు బాగా ఉపయోగపడుతుంది. నోటిని రిఫ్రెష్ చేయడంలో సోంపు ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు నీరు తాగకుండా ఉన్నా, నోరు మెదపకుండా ఉండేవారు తరచూ సోంపు వేసుకుంటే ఈ సమస్య దూరమవుతుంది. సోంపులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.