Coriander Seed Water: రాత్రంతా నానబెట్టిన ధనియాల నీళ్లు తాగితే.. ఏమవుతుందో తెలుసా.?

Coriander Seed Water: వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో ధనియాలు ఒకటి. ధనియాల పొడి లేనిది ఏ వంటకాన్ని ఊహించుకోలేము.

Update: 2024-09-20 01:00 GMT

Coriander Seed Water: రాత్రంతా నానబెట్టిన ధనియాల నీళ్లు తాగితే.. ఏమవుతుందో తెలుసా.?

Coriander Seed Water: వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో ధనియాలు ఒకటి. ధనియాల పొడి లేనిది ఏ వంటకాన్ని ఊహించుకోలేము. వంటకు రుచిని ఇచ్చే ధనియాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ధనియాలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.? రాత్రంతా ధనియాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటిని ఉదయాన్నే తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుంది.

* థైరాయిడ్ సమస్య ఉన్న వారికి కూడా ధనియా నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ధనియా గింజల్లో పుష్కలంగా ఉండే ఆక్సిడెంట్లు థైరాయిడ్ సమస్యను నియంత్రిస్తాయి.

* మహిళల్లో పీరియడ్స్‌ సమయంలో వచ్చే సమస్యలను చెక్‌ పెట్డడంలో ధనియాల నీళ్లు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఫలితం ఉంటుంది.

* బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ ధనియాల నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ల కారణంగా బరువు అదుపులో ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల కడుపు వాపు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

* చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ధనియాల నీళ్లు ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడుతుంటుంది. మొటిమలు కూడా తగ్గుతాయి.

* జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ధనియాల నీళ్లు బాగా పనిచేస్తాయి. రోజూ పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగువుతుంది. మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరమవుతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News