Health Benefits with Pumpkin: గుమ్మడికాయతో ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits with Pumpkin | గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రథమైన తరచూ వాడబడు కూర

Update: 2020-09-18 04:20 GMT

Health Benefits with Pumpkin | గుమ్మడి ఆంధ్రులకు ప్రీతికరమైన శుభప్రథమైన తరచూ వాడబడు కూర. ఇది ప్రపంచములో అన్ని దేశాలలో దొరుకు తుంది . గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.

గుమ్మడిలోని ఔషధ ఉపయోగాలు..

ఇందులో చాల ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది, శరీరానికు తక్కుకా క్యాలరీలు అందిస్తుంది. కళ్ళకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి కుడా సంవృద్దిగా లభిస్తుంది. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది. బి.పి.ని నియంత్రిస్తుంది, పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ను తగ్గిస్తుంది. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాధులు తగ్గుతాయి.

గుమ్మడికాయల్లో ఫైబర్, పొటాషియం కూడా ఎక్కువే. అందుకే వీటిని కాన్సర్ పేషెంట్ల ఆహారంలో చేర్చారు. ఐతే... గుమ్మడికాయలు... కాన్సర్ పేషెంట్లు అందరికీ సెట్ కావు. కొంతమంది పేషెంట్లకు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినబుద్ధి కాదు. విరేచనాల సమస్య ఎదురవుతుంది. అలాంటి వారికి గుమ్మడికాయల ఆహారం పెట్టడం మంచిది కాదు. అది తప్పితే... మిగతా ఎవరికైనా ఇవి చాలా మేలు చేస్తాయి. ఓసారి డాక్టర్ సలహా తీసుకున్నాక వాడితే సరిపోతుంది.

ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. వీటిలో మెగ్నీషియం మెండుగా ఉంది. ఇంకా మినరల్స్‌ అత్యధికంగా పోగుపడ్డ గింజలు.

గుమ్మడికాయల్ని ఇలా కుడా తినవచ్చు...

రోస్ట్ చేసి, తాజా మొజ్జారెల్లా సలాడ్‌లో కలిపి తినవచ్చు.

♦ గుమ్మడికాయ, బ్రెడ్ కలిపి తినవచ్చు.

♦ యాపిల్, గుమ్మడికాయ కలిపి పాన్ కేక్స్‌లా తినవచ్చు.

♦ గుమ్మడికాయ గింజల్ని వేపుకొని తినవచ్చు. గింజల్ని శుభ్రం చేసి... కొద్దిగా నూనె వేసి... వేపుకోవాలి. గింజలు గోల్డ్ కలర్‌లోకి మారే వరకూ వేపాలి. ఇందుకు దాదాపు 20 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత కాస్త ఉప్పు, ఇతరత్రా స్పైసీ వేసుకోవచ్చు.

Tags:    

Similar News