Custard Apple: ఈ సీజన్‌లో సీతాఫలాన్ని కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా?

సీతాఫంలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

Update: 2024-10-10 07:34 GMT

Custard Apple: ఈ సీజన్‌లో సీతాఫలాన్ని కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా?

Custard Apple: సీజన్‌లో లభించే పండ్లలో సీతాఫలం ప్రధానమైంది. చలి కాలం ప్రారంభం కాగానే లభించే సీతాఫలంతో ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మిగతా సీజన్స్‌లో కాకుండా కేవలం కొంతకాలమే లభించే ఈ పండ్లను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ సీతాఫలం తీసుకోవడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాఫంలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులోని విటమిన్లు ఎ, బి, కె, ప్రొటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

బీపీ సమస్యతో బాదపడేవారికి కూడా సీతాఫలాలు దివ్యౌషధంగా చెప్పొచ్చు. ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని అందించడంలో ఇవి ఉపయోగపడుతాయి. ఉదయాన్నే వీటిని తీసుకోవడం వల్ల రోజంతా ఉషారుగా ఉండొచ్చు. సీతాఫలంలో పుష్కలంగా లభించే.. విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సీతాఫలం ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చూడడంలో సీతాఫలం ఉపయోగపడుతుంది. ఇందులోని మెగ్నీషియం, సోడియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సీతాఫలాల్లో ఉండే ఇతర పోషకాలు చెడు కొవ్వును కరిగించి.. మంచి కొవ్వును పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా సీతాఫలాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అజీర్తి, అల్సర్‌ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది. కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సీతాఫలంలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Tags:    

Similar News