Health Benefits of Watermelon: పుచ్చకాయ ప్రయోజనాలు, పోషక విలువలు..
Health Benefits of Watermelon | పుచ్చకాయ యొక్క చల్లని రసం మన దాహాన్ని అణచివేస్తుంది మరియు వేడిలో అలసిపోయిన మనల్ని రిఫ్రెష్ చేస్తుంది.
Health Benefits of Watermelon | పుచ్చకాయ యొక్క చల్లని రసం మన దాహాన్ని అణచివేస్తుంది మరియు వేడిలో అలసిపోయిన మనల్ని రిఫ్రెష్ చేస్తుంది. కానీ ఈ పండుకి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన శరీరానికి ప్రయోజనకరంగా ఉండే అత్యవసర ఖనిజాలు మరియు విటమిన్లను ఇది కలిగి ఉంటుంది. ఇవన్నీ కాకుండా, పుచ్చకాయ అనేది లైకోపీన్ అని పిలవబడే ఒక ఫైటోకెమికల్ యొక్క గొప్ప వనరు, ఇది పండు యొక్క ముదురు ఎరుపు రంగుకి బాధ్యత వహిస్తుంది. ఈ ఫైటోకెమికల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.ఈ క్రింద పుచ్చకాయల యొక్క అత్యంత సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని ఇవ్వబడ్డాయి.
పుచ్చకాయల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
* శాస్త్రీయ నామం: సిట్రూలస్ లానాటస్ (Citrullus lanatus)
* కుటుంబం: కుకుర్బిటేసే (Cucurbitaceae)
* సాధారణ నామం: వాటర్ మీలోన్, తర్బుజ్
* స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: పుచ్చకాయలు ఆఫ్రికాకు చెందినవి, కానీ అవి ప్రపంచవ్యాప్తంగా వేడిగా ఉండే వాతావరణాల్లో పెరుగుతాయి.
* రక్త పోటుకు: పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. అది సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయం చేస్తుంది.
* కండరాలకు: పుచ్చకాయ అథ్లెట్లు మరియు అధిక వ్యాయామాలు చేసేవారిలో కలిగే కండరాల నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తుంది, ఓక అధ్యయనం పుచ్చకాయ రసం తగిన 24 గంటల లోపు కండరాల నొప్పులను తగ్గించిందని సూచించింది.
*యాంటీఆక్సిడెంట్గా: అధ్యయనాలు పుచ్చకాయలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుందని పేర్కొన్నాయి. అది ఫ్రీ రాడికల్స్ వలన కలిగే డీఎన్ఏ నష్టాన్ని తగ్గిస్తుంది తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది .
* కంటి కోసం: పుచ్చకాయలో ఉండే లైకోపీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ కంటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి, అలాగే పుచ్చకాయ వయసు ఆధారిత మక్యూలర్ డిజెనెరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
* మూత్రపిండాలకు: పుచ్చకాయ ఒక మూత్రవిసర్జకారి (డైయూరేటిక్), ఇది శరీరం నుండి అదనపు సాల్ట్ లను మరియు టాక్సిన్లను తొలగించడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
* గర్భిణీ స్త్రీలకు: పుచ్చకాయ గర్భిణీ స్త్రీలలో సంభవించే రుగ్మతలైన ప్రీఎక్లంప్సియా మరియు గర్భాశయంలో పెరుగుదల తగ్గిపోవడం తగ్గిపోవడం వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
* క్యాన్సర్ కోసం: పుచ్చకాయలో ఉండే లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ కాన్సర్ కణాలకు వ్యతిరేకంగా చర్యలను చూపిందని
నివేదించబడింది.
పుచ్చలో పోషక పదార్థాలు...
100 గ్రా. పుచ్చకాయ గుజ్జులో
* నీరు - 95.2 గ్రా.
* ప్రోటీన్ - 0.3 గ్రా.
* కొవ్వు పదార్థాలు - 0.2 గ్రా.
* పీచు పదార్థాలు - 0.4 గ్రా.
* కెరోటిన్ - 169 మైక్రో గ్రా.
* సి విటమిన్ - 26 మి.గ్రా.
* కాల్షియం - 32 మి.గ్రా.
* ఫాస్ఫరస్ - 14 మి.గ్రా.
* ఐరన్ - 1.4 మి.గ్రా.
* సోడియం - 104.6 మి.గ్రా.
* పొటాషియం - 341 మి.గ్రా.
* శక్తి - 17 కిలోకాలరీలు