Beauty Tips: ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా తయారైందా.. టమోటాతో ఇలా చేస్తే మెరిసిపోతారు..!

Beauty Tips: ఎండలు మండిపోతున్నాయి, వేడి గాలులు వీస్తున్నాయి. చల్లదనం కోసం జనాలు అల్లాడిపోతున్నారు.

Update: 2024-04-21 02:30 GMT

Beauty Tips: ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా తయారైందా.. టమోటాతో ఇలా చేస్తే మెరిసిపోతారు..!

Beauty Tips: ఎండలు మండిపోతున్నాయి, వేడి గాలులు వీస్తున్నాయి. చల్లదనం కోసం జనాలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది బయటికి వెళ్లి జాబ్‌ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వారు ఎండలో తిరగడం వల్ల ముఖం మొత్తం జిడ్డుగా తయారవుతుంది. దీంతో పాలిపోయి అంద విహీనంగా కనిపిస్తారు. ఇలాంటి వారు ఇంటికి వచ్చిన తర్వాత చిన్న చిట్కా పాటిస్తే కోల్పోయిన నిగారింపు మళ్లీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.

సాధారణంగా మనం రోజు వండే వంటల్లో టమాటాలు వేస్తుంటాం. కానీ ప్రత్యేకంగా టొమాటో కూర వండడం అరుదు. టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టొమాటోలోలికోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరానికి సన్ స్క్రీన్ మాదిరి పనిచేస్తుంది. అంతేకాదు టమాటా గుజ్జును చర్మానికి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు, మచ్చలకు ఇది దివ్య ఔషధంలా పని చేస్తుంది. టమాటా గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొటిమలు మాయం అవుతాయి.

టమాటాలో ఉండే విటమిన్-ఎ, విటమిన్-సి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. రెట్టిం పు అందాన్ని ఇస్తాయి. టమాటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ సెల్యులార్ డ్యామేజ్ అవకుండా కాపాడుతాయి. అంతేకాకుండా చిన్న వయస్సులో ఏర్పడే వృద్ధాప్య ఛాయలను నివారిస్తాయి. అందుకే వేసవిలో టమాటాలు ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. టామాటా జ్యూస్లు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. అవసరమైతే టమోటాలను బాగా కడిగి పచ్చిగా కూడా తినవచ్చు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

Tags:    

Similar News