గులాబ్ జామ్ భారతీయ వంటకం కాదు.. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..
* మిఠాయిల ప్రస్తావన వచ్చినప్పుడల్లా గులాబ్ జామ్ గురించి చర్చ జరుగుతుంది.
Gulab jam: స్వీట్లు అంటే చాలా మందికి ఇష్టం. వీటి రుచిని ఎంతో ఆస్వాదిస్తారు. ముఖ్యంగా భారతీయులు వీటి విషయంలో చాలా ముందుంటారు. అయితే ఎన్నో రకాల స్వీట్లున్నా అందులో గులాబ్ జాం కి ప్రత్యేక గుర్తింపు ఉంది.
మిఠాయిల ప్రస్తావన వచ్చినప్పుడల్లా గులాబ్ జామ్ గురించి చర్చ జరుగుతుంది. ఇది భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒక్కసారి తెలుసుకుందాం.
పెర్షియన్ పదజాలం ప్రకారం గులాబ్ జామ్ రెండు పదాల పేరు. మొదటిది 'గుల్' అంటే పువ్వు. రెండోది 'ఆబ్' అంటే నీరు. అంటే గులాబీల సువాసనతో కూడిన తీపి నీరు అని అర్థం. మనం సాధారణ భాషలో గులాబ్ జామ్ అని పిలుస్తాం.
ఇవి ముదురు రంగులోకి వచ్చే వరకు వేయిస్తారు అందుకే జామ్‌తో పోల్చారు. కాబట్టి దీనికి గులాబ్ జామ్ అనే పేరు వచ్చింది. మధ్య యుగాలలో ఇరాన్ దేశంలో మొదటిసారిగా గులాబ్ జామ్ తయారచేశారని చరిత్ర చెబుతోంది. టర్కిష్ ప్రజలు దీనిని భారతదేశానికి తీసుకువచ్చారు.
మరో విషయం ప్రకారం దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుక్ తయారు చేశారని చెబుతారు. ఇప్పుడు ఇది భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. స్వీట్లలో అగ్రస్థానంలో ఉంది. అరబ్ దేశాల్లో తినే స్వీట్లు, లుక్మత్-అల్-ఖాదీ, గులాబ్ జామ్‌కి చాలా పోలికలు ఉన్నాయి.
దీన్ని తయారుచేసే విధానం కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ రెండు ఒకే కోవలోకి వస్తాయి. అయితే ఇవి రెండు పర్షియన్ దేశాల నుంచి వచ్చాయని అంటారు. పశ్చిమ బెంగాల్‌లో దీనిని పాంటువా, గోలప్ జామ్, కలో జామ్ అని కూడా అంటారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ గులాబ్ జామున్‌కు ప్రసిద్ధి చెందింది. జబల్పూర్, కటంగిలో ఒక స్థలం ఉంది ఇక్కడ ముడతల రసగుల్లాలు ప్రసిద్ధి చెందాయి. ఇవి పరిమాణంలో చాలా పెద్దవి. రుచి, పరిమాణం కారణంగా ఇక్కడకు వచ్చిన ప్రతి వ్యక్తి దీని రుచిని ఆస్వాదిస్తాడు.