Before Marriage: పెళ్లికి ముందు ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి.. ఎందుకంటే..?

Before Marriage: భారతదేశంలో వివాహ బంధం చాలా పవిత్రమైనది.

Update: 2022-11-26 15:45 GMT

Before Marriage: పెళ్లికి ముందు ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి.. ఎందుకంటే..?

Before Marriage: భారతదేశంలో వివాహ బంధం చాలా పవిత్రమైనది. పెళ్లైన జంట వైవాహిక జీవితం సంతోషంగా గడిచిపోవాలని అందరూ కోరుకుంటారు. అయితే మీరు కూడా వివాహానికి సిద్ధమవుతున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోండి. ఇది వివాహానంతరం వచ్చే సమస్యలని పరిష్కరిస్తుంది. మీకు పుట్టబోయే పిల్లలను జన్యుపరమైన వ్యాధుల నుంచి కూడా రక్షించవచ్చు.

సంతానోత్పత్తి పరీక్ష

వాస్తవానికి పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిల జాతకాలను చూస్తారు. అంతేకాదు వారి చదువులని కూడా చెక్ చేస్తారు. కానీ వైద్య పరీక్షలు మాత్రం చేయించరు. నిజానికి ఫెర్టిలిటి టెస్ట్‌ చేయడం వల్ల దంపతుల్లో సంతానానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే తెలుస్తుంది. దీనివల్ల సరైన సమయంలో చికిత్స తీసుకోవచ్చు.

జన్యు వైద్య చరిత్ర

ప్రస్తుత కాలంలో మధుమేహం లేదా గుండె జబ్బులు సర్వసాధారణమైపోయాయి. అందువల్ల దంపతులు ఒకరికొకరు కుటుంబ వైద్య చరిత్రను తెలుసుకుంటే మంచిది. భవిష్యత్తులో ఈ వ్యాధులకు చికిత్స చేయవచ్చు.

తలసేమియా పరీక్ష

కొన్నిసార్లు పిల్లలలో పుట్టుకతోనే వ్యాధులు సంభవిస్తాయి. అందులో ఒకటి తలసేమియా వ్యాధి. అందుకే పెళ్లికి ముందు తప్పనిసరిగా తలసేమియా పరీక్షలు చేయించుకోవాలి.

HIV పరీక్ష

ఇది చాలా ముఖ్యమైన పరీక్ష. ఏ వ్యక్తి అయినా వివాహానికి ముందు తప్పనిసరిగా HIV, STD పరీక్ష చేయించుకోవాలి. సురక్షితమైన సెక్స్‌కు ఇది చాలా ముఖ్యం. మీరు పెళ్లికి సిద్ధమవుతున్నట్లయితే ఖచ్చితంగా సెరాలజీ స్క్రీనింగ్ చేయించుకోవాలి.

మానసిక ఆరోగ్య స్థితి

వివాహానికి ముందు ఏదైనా మానసిక వ్యాధితో బాధపడుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేదంటే వివాహం తర్వాత వారి బంధం నిలవదు. ఇవన్ని ముందుగానే తెలుసుకుంటే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Tags:    

Similar News