Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!

Wrinkles: ప్రతి ఒక్కరూ అందంగా, యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం ముఖ చర్మం బిగుతుగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.

Update: 2022-05-27 14:30 GMT

Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!

Wrinkles: ప్రతి ఒక్కరూ అందంగా, యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం ముఖ చర్మం బిగుతుగా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. వదులుగా ఉండే చర్మం, ముడతలు వృద్ధాప్య సంకేతాలు. అకాల వృద్ధాప్యం మీ వయస్సును ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. ఇది మంచి ఆరోగ్యానికి సంకేతం కాదు. మీ వయస్సు 30 ఏళ్లలో ఉండి మీ ముఖంపై ముడతలు రావడం ప్రారంభించినట్లయితే మీరు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా వాటిని అధిగమించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

పెరుగుతున్న వయస్సుతో చర్మం మెరుపు కూడా తగ్గుతుంది. దీంతో ముడతలు సంభవిస్తాయి. ముఖ కణజాలం, కండరాలు వదులుగా మారతాయి. కొల్లాజెన్ సప్లిమెంట్లు పౌడర్ లేదా లిక్విడ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. కానీ వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అయితే ఇది శాశ్వత నివారణ కాదు. మీరు తగినంత నీరు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఆలివ్‌ నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ ఎ, ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆయిల్‌తో ముఖాన్ని క్రమం తప్పకుండా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. అంతేకాక ముడతలు తొలగిపోతాయి.

అరటిపండు ముఖంలోని ముడతలను తొలగించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అరటిపండులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముడతలని తగ్గిస్తాయి. ఇందుకోసం వారానికి రెండుసార్లు అరటిపండు గుజ్జును పేస్ట్‌లా చేసి ముఖానికి 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత కడిగితే చాలు.

విటమిన్‌ ఈ క్యాప్సూల్‌ను ఒక చెంచా అలోవెరా జెల్‌లో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలను తొలగిపోతాయి.

Tags:    

Similar News