Summer: వేసవిలో చెమట వాసనకి ఈ చిట్కాలు పాటించండి..!
Summer: వేసవి కాలంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో చెమటలు పట్టడం సాధారణ ప్రక్రియ.
Summer: వేసవి కాలంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో చెమటలు పట్టడం సాధారణ ప్రక్రియ. దీని వల్ల శరీరంలో ఉండే చర్మ రంధ్రాలన్నీ ఆటోమేటిక్‌గా శుభ్రమవుతాయి. కానీ కొన్నిసార్లు విపరీతమైన చెమట వల్ల దుర్వాసన వస్తోంది. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే శరీరం నుంచి చెమట బయటకు వస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ చెమట వల్ల శరీరంపై తేమ వస్తుంది. ఈ తేమలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల దుర్వాసన రావడం మొదలవుతుంది. మీరు కూడా వేసవిలో చెమటలు పట్టడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తే కొన్ని చిట్కాలతో వదిలించుకోవచ్చు.
1. బంగాళాదుంపలు
బంగాళాదుంప శరీరాన్ని క్లీన్ చేసే గుణాలని కలిగి ఉంటాయి. ఇది చర్మంలో ఉన్న మురికిని తొలగిస్తుంది. ఇది శరీర దుర్వాసనను దూరం చేస్తుంది. ప్రతిరోజూ స్నానం చేస్తున్నప్పుడు మీకు ఎక్కువగా చెమట పట్టే శరీర భాగాలలో పచ్చి బంగాళాదుంప ముక్కలను రుద్దండి. ఇది చెమట వాసన తొలగిస్తుంది. అంతే కాకుండా స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు, పటిక వేసి స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు చల్లగా తాజాగా ఉంటారు.
2. నిమ్మకాయ
నిమ్మకాయ శరీర దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు చెమట సమస్యను తొలగించడంలో దోహదం చేస్తుంది. ప్రతిరోజూ స్నానం చేసే ముందు నీళ్లలో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి తలస్నానం చేయాలి. చెమట, దుర్వాసన సమస్య దూరమవుతుంది.
3. ఐస్
చెమట, దుర్వాసన సమస్యను ఐస్ సహాయంతో తొలగించవచ్చు. మీకు విపరీతమైన చెమటతో సమస్య ఉంటే ముందుగా మీరు ఐస్ ముక్కను తీసుకుని శరీరంలోని ఎక్కువ చెమట పట్టే భాగాలపై రుద్దండి. మీ చెమట వాసన సమస్య తొలగిపోతుంది.
4. దోసకాయ
దోసకాయలో చెమట సమస్యను తొలగిస్తుంది. వేసవిలో స్నానం చేసే ముందు చెమట పట్టే ప్రదేశాలలో చల్లని దోసకాయను రుద్దండి. దీంతో చెమటలు పట్టే సమస్య పోయి ఫ్రెష్ గా ఉంటారు.