Good Sleep: సుఖవంతమైన నిద్ర కోసం ఉత్తమ చిట్కాలు.. అవేంటంటే..?
Good Sleep: ఒక్కరోజు నిద్రలేకపోతే శరీరం బలహీనంగా తయారువుతుంది. అంతేకాదు ఏ పనిపై దృష్టి సారించలేము.
Good Sleep: ఒక్కరోజు నిద్రలేకపోతే శరీరం బలహీనంగా తయారువుతుంది. అంతేకాదు ఏ పనిపై దృష్టి సారించలేము. బద్దకం పెరిగిపోతుంది. ముఖం అంద వికారంగా తయారవుతుంది. అందుకే ఒక వ్యక్తి కచ్చితంగా రోజుకు కనీసం 6 గంటలైనా నిద్రపోవాలి. ఆధునిక జీవన శైలిలో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. మంచి నిద్ర మంచి ఆలోచనలకు కారణం అవుతుంది. కాబట్టి సుఖవంతమైన నిద్ర కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
నిద్రపోవాలి అనుకున్నప్పుడు గాడ్జెట్ జోలికి అస్సలు పోకూడదు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ని తీసి దూరంగా పెట్టాలి. లేదంటే స్విచ్ఛాప్ చేయాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు మంచి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నిద్రపోయే ముందు కనీసం ఒక గంట పాటు మీ ఫోన్‌కు దూరంగా ఉంటే మంచిది. నిద్రకు ఉపకరించే ముందు ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. శరీరంలో తగినంత నీరు లేకుంటే రాత్రి సమయంలో నిర్జలీకరణానికి గురవుతారు. మీరు నిద్రిస్తున్నప్పుడు మీ హైడ్రేషన్ స్థాయిలు దారుణంగా పడిపోతాయి. అందుకే రోజు సరిపడ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు దాహం వేయకున్నా మధ్య మధ్యలో ఒక సిప్ వాటర్ తాగుతూ ఉండాలి. అప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉంటుంది.
ఉదయం మీరు యాక్టివ్‌గా ఉండాలంటే రాత్రి సౌకర్యవంతమైన నిద్ర పోవాలి. రాత్రిపూట తొమ్మిది గంటలోపే డిన్నర్ ముగించాలి. అంతేకాకుండా ఉదయమే మేల్కొనాలి. ఎక్సర్ సైజ్ తప్పనిసరిగా చేయాలి. రాత్రి అయినా మధ్యాహ్నం అయినా తిన్న తర్వాత కాసేపు నడవాలి. ఇది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. నిద్రపోయే ముందు పుస్తకాన్ని చదవడం లేదా ప్రశాంతమైన సంగీతాన్ని వినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పడుకునే ముందు పుస్తకం చదవడానికి లేదా ఏదైనా రాయడానికి కొంత సమయం కేటాయించండి. ఇది ప్రశాంతమైన మానసిక స్థితికి రావడానికి మీకు సహాయపడుతుంది. ధ్యానం చేయడం, సాగదీయడం, వేడి నూనెతో మీ తలకు మసాజ్ చేయడం లేదా తేలికపాటి వెచ్చని స్నానం చేయడం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది.