Lifestyle: చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా.? స్నానం చేసేప్పుడు ఇలా చేయండి..

సాధారణంగా బ్యాక్టీరియా కారణంగా చెటమ దుర్వాస వస్తుంది. అందుకే చెమట వాసన రాకుండా ఉండాలంటే స్నానం చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి.

Update: 2024-09-25 16:30 GMT

Lifestyle: చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా.? స్నానం చేసేప్పుడు ఇలా చేయండి.. 

మనలో చాలా మంది చెమట సమస్యతో బాధపడుతుంటారు. కొందరికి కేవలం వాతావరణం వేడిగా ఉన్న సమయంలో మాత్రమే చెమట వస్తే.. మరికొందరికి మాత్రం వాతావరణంతో సంబంధం లేకుండా చెమట ఎక్కువగా వస్తుంది. చెమట వచ్చే వారిలో చర్మం నుంచి వాసన రావడం సర్వ సాధారణమైన విషయం. అయితే ఈ దుర్వాసన నుంచి బయటపడాలంటే కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా బ్యాక్టీరియా కారణంగా చెటమ దుర్వాస వస్తుంది. అందుకే చెమట వాసన రాకుండా ఉండాలంటే స్నానం చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. స్నానం చేసే సమయంలో ఒక బకెట్ నీటిలో 5-6 చుక్కల కొబ్బరి నూనె కలుపుకోవాలి. అనంతరం ఆ నీటితో స్నానం చేస్తే సరిపోతుంది. చెమట దుర్వాసన క్రమంగా తగ్గిపోతుంది. చెమట కంపును తగ్గించడంలో బేకింగ్ సోడా కూడా ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు బకెట్ నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసుకుని స్నానం చేయటం వల్ల చెమట వాసనను దూరంగా ఉంచుతుంది.

వేప ఆకులు కూడా చెమట కంపును దూరం చేయడంలో ఎంతో ఉపయోగపడాయి. స్నానం చేసే ముందు బకెట్‌లో కొన్ని వేప ఆకులను వేసుకొని కాసేపటి తర్వాత స్నానం చేయాలి. లేదంటే వేప నూనె వేసుకున్నా చెమట కంపు నుంచి బయటపడొచ్చు. పసుపు పొడి కూడా చెమట కంపును దూరం చేస్తుంది. స్నానం చేసే ముందు బకెట్‌లో రెండు చెంచాల పసుపు పొడిని కలపాలి. ఆ నీటితో క్రమంతప్పకుండా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చెమట వాసన రాకుండా ఉంటుంది.

ఇక తీసుకునే ఆహారం కూడా చెమట వాసనకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో కెఫైన్‌, మసాలా, ఆల్కహాల్‌ వంటివి ఉండడం వల్ల చెమట దుర్వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News