Acne Problem: మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ ఆయుర్వేద పద్దతులతో చెక్‌ పెట్టండి..!

Acne Problem: నేటి యువత ముఖంపై మొటిమల సమస్యతో చాలా ఇబ్బందిపడుతున్నారు.

Update: 2023-06-14 12:31 GMT

Acne Problem: మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ ఆయుర్వేద పద్దతులతో చెక్‌ పెట్టండి..!

Acne Problem: నేటి యువత ముఖంపై మొటిమల సమస్యతో చాలా ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా ఇది అందరు ఎదుర్కొనే సమస్యే. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితే ముఖం మొత్తం అంద విహీనంగా తయారవుతుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి అనేక ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. కానీ ఈ ఉత్పత్తులు చర్మానికి హాని కలిగించే రసాయనాలతో తయారుచేస్తారు. అందుకే వీటి జోలికి పోవద్దు. ఆయుర్వేద పద్ధతుల సహాయంతో చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసుకోవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. క్రమం తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేయండి.

ముఖాన్ని క్రమతప్పకుండా తేలికపాటి క్లెన్సర్‌తో రోజుకు రెండుసార్లు శుభ్రం చేయాలి. చర్మం pH స్థాయికి భంగం కలిగించే సబ్బులని నివారించండి.

2. వేప, పసుపు ఉపయోగించండి

కొన్ని మూలికలు రక్తాన్ని శుద్ధి చేయడంలో, మంటను తగ్గించడంలో సహాయపడుతాయి. వేప, పసుపు, కలబంద ఈ కోవలోకి వస్తాయి. వీటిని ఉపయోగించి మొటిమలు తొలగించుకోవచ్చు. గంధపు పేస్ట్, పసుపు పేస్ట్, వేపపేస్ట్‌ని డై బై డే ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు.

3. త్రిఫల చూర్ణం

త్రిఫల శరీరాన్ని శుభ్రపరుస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

4. ఒత్తిడిని నియంత్రించండి

ఒత్తిడి వల్ల మొటిమలు మరింత ఎక్కువవుతాయి. వీటిని తగ్గించడానికి యోగా, ధ్యానం, లోతైన శ్వాస వంటి పద్ధతులను అనుసరించాలి.

5. మంచి నిద్ర

ప్రతిరోజు 8 గంటల నిద్ర ఉండే విధంగా చూసుకోండి. ఇది చర్మం ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర తక్కువగా ఉండే చర్మం వాడిపోయి కనిపిస్తుంది.

6. రక్తపోటును మెరుగుపరచడానికి, టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసే సమయంలో చెమట పట్టడం వల్ల చర్మం మరింత శుభ్రపడుతుంది.

7. ముఖాన్ని తాకవద్దు

ముఖాన్ని తరచుగా తాకడం మానుకోండి. ఎందుకంటే ఇది బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తుంది. మొటిమలను తీవ్రతరం చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగండి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Tags:    

Similar News