Weight Loss Tips: ఈజీగా బరువు తగ్గాలా.. ఈ 4 అలవాట్లు పాటిస్తే సరి.. నెలలో బెల్లీ ఫ్యాట్ మాయం..!
Habits To Maintain Weight: మన చుట్టూ ఉన్న చాలా మంది వ్యక్తులు స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉండాలని కోరుకుంటారు.
Habits To Maintain Weight: మన చుట్టూ ఉన్న చాలా మంది వ్యక్తులు స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉండాలని కోరుకుంటారు. బరువు తగ్గడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీని కోసం కఠినమైన ఆహారం, భారీ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మనలోని కొన్ని చెడు అలవాట్లు బరువు పెరగడానికి కారణమవుతాయి. వీటిని మనం వదులుకోలేకపోతున్నాం. నూనె, తీపి ఆహారం తినడం, శారీరక శ్రమలు లేకపోవడం మొదలైనవి. బరువు తగ్గాలంటే కొన్ని అలవాట్లను క్రమంగా పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గాలంటే ఈ అలవాట్లను పాటించండి..
1. ఉదయాన్నే వేడినీళ్లు తాగండి..
ఉదయం నిద్రలేవగానే వేడినీళ్లు తాగడం బరువు తగ్గడానికి సులభమైన మార్గం. ఈరోజు నుంచే అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల పొట్ట శుభ్రంగా ఉండి జీవక్రియ మెరుగవుతుంది. దీని ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా పేర్కొన్నారు. మీరు రోజూ 2 కప్పుల గోరువెచ్చని నీటిని తాగితే, మీ శరీరం ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటుంది. అలాగే తేనెతో కలిపిన గోరువెచ్చని నీటిని కూడా తాగవచ్చు. ఇది బరువు తగ్గడానికి సమర్థవంతమైన మార్గం.
2. ఆరోగ్యమైన అల్పాహారం..
మీరు బరువు తగ్గాలంటే, అది రోజులో మొదటి భోజనంతోనే ప్రారంభించాలి. దీని కోసం మీరు అల్పాహారంలో ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినాలి. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఈ జాబితాలో గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, మొలకలు, పండ్లు, పండ్ల రసాలు లేదా కూరగాయల రసాలను చేర్చవచ్చు.
3. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి..
బరువు తగ్గడానికి, మీరు శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. దీని కారణంగా, నడుము, పొత్తికడుపు చుట్టూ కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గడం సులభం అవుతుంది. అందుకే పొద్దున్నే లేచి పరుగెత్తడం, జాగింగ్ చేయడం, యోగా చేయడం, జిమ్‌లో చెమటలు కక్కడం చాలా ముఖ్యం. వ్యాయామం ద్వారా జీవక్రియను పెంచవచ్చు. వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
4. శరీరానికి నీటి కొరత రానివ్వకూడదు..
శరీరంలో నీటి కొరత ఏర్పడితే అది మన జీవక్రియపై ప్రభావం చూపుతుంది. మానవ శరీరంలో ఎక్కువ భాగం నీటితో తయారవుతుంది. కాబట్టి శరీరం హైడ్రేట్ గా ఉండకపోతే, శరీర పనితీరులో సమస్యలు వస్తాయి. బరువు తగ్గడం సులభం కాదు.