Health Tips: మధుమేహ రోగులకి మెంతులు దివ్యౌషధం.. పరగడుపున తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు..!
Health Tips:మధుమేహ రోగులకి మెంతులు దివ్యౌషధం.. పరగడుపున తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు..!
Health Tips: మెంతులు ప్రతి ఇంట్లో ఉంటాయి. అనేక వంటలలో దీనిని మసాలాగా ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని రెట్టింపు చేస్తుంది. మెంతులలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ రోగులకు దివ్య ఔషధమని చెప్పవచ్చు. వారు తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి. మెంతికూరలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుంచి బయటపడటానికి పనిచేస్తుంది. మెంతికూర తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మెంతి టీ
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు మెంతి టీ తాగాలి. దీన్ని చేయడానికి గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోసి మంటపై వేడిచేయాలి. తర్వాత అందులో పావు చెంచా మెంతులు వేసి బాగా మరిగించాలి. ఈ గింజలు ఉడికిన తర్వాత గ్యాస్‌ను ఆపివేసి ఈ నీటిని వడబోసి అందులో తేనె, నిమ్మరసం కలుపుకుని పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు ఊబకాయం తగ్గుతుంది.
నానబెట్టిన మెంతి గింజలు
నానబెట్టిన మెంతి గింజల్లో పెద్ద మొత్తంలో ఫైబర్ లభిస్తుంది. ఇది మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు నానబెట్టిన మెంతులు మధుమేహ రోగులకు దివ్యౌషధంగా పని చేస్తాయి. మధుమేహ రోగులు మెంతి పరాటా తినవచ్చు. మెంతి పరోటా తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
బాలింతలకు
మెంతి ఆకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. బాలింతలకు మెంతికూర పప్పు, మెంతులు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణులకు ప్రసవాన్ని సులభతరం చేస్తుంది. మెంతులతో గర్భాశయ వ్యాధులు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవం తర్వాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవుతుంది.
ఇతర వ్యాధులకి
మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయంలా తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లలో లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. పొట్ట ఉబ్బరంగా, జీర్ణక్రియ సరిగా లేకపోతే అరస్పూను మెంతుల్ని నానబెట్టి తినటం లేదంటే అన్నంలో కలిపి తీసుకోవటం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పేగుల లోపల వాపు తగ్గించే గుణం మెంతులకు ఉంది.