Children Breakfast: స్కూల్స్‌కి వెళ్లే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవి తినిపించండి.. సాయంత్రం వరకు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు..!

Children Breakfast: స్కూల్స్‌కి వెళ్లే పిల్లలకు ఇమ్యూనిటీ చాలా అవసరం. లేదంటే వారు తొందరగా జబ్బు పడుతారు. అందుకే వారికి హెల్తీ ఫుడ్స్‌ అందించాలి.

Update: 2023-11-02 01:30 GMT

Children Breakfast: స్కూల్స్‌కి వెళ్లే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవి తినిపించండి.. సాయంత్రం వరకు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు..!

Children Breakfast: స్కూల్స్‌కి వెళ్లే పిల్లలకు ఇమ్యూనిటీ చాలా అవసరం. లేదంటే వారు తొందరగా జబ్బు పడుతారు. అందుకే వారికి హెల్తీ ఫుడ్స్‌ అందించాలి. పిల్లలకు ఉదయం పూట పెట్టే బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైనది. ఇందులో ఎలాంటి ఆహారం తినిపిస్తామో వాటిపైనే వారి శక్తి ఆధారపడి ఉంటుంది. అప్పుడే వారు సాయంత్రం వరకు అలసిపోకుండా ఉంటారు. అలాంటి ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అవోకాడో

ఆవకాడో చాలా ఆరోగ్యకరమైన పండు. ఇందులో మంచి కొవ్వులు, పోషకాలకు కొరత లేదు. దీనిని తినడం వల్ల పొట్ట చాలా సేపు నిండుగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. బరువును మెయింటెన్‌ చేయగలుగుతారు. రోజంతా ఎనర్జీ అందడంతో పాటు పిల్లల ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

గుడ్లు

గుడ్లు ప్రోటీన్, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్ల నుంచి వేయించిన గుడ్ల వరకు మీ పిల్లల అభిరుచికి అనుగుణంగా వారికి తినిపించాలి. ఇది పిల్లల శరీరాన్ని బలపరుస్తుంది.

పెరుగు

పెరుగు పిల్లల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మీరు దానికి బెర్రీలను జోడిస్తే అద్భుతమైన అల్పాహారం అవుతుంది. సాయంత్రం వరకు పూర్తి ఎనర్జిటిక్‌గా ఉంటారు.

ఓట్స్

మనలో చాలా మంది ఓట్స్ ను హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. వీటిని ఉదయం పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా తినిపించవచ్చు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు, కేలరీలు, ప్రోటీన్, ఫైబర్, పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి రోజంతా వారి అనేక అవసరాలను తీరుస్తాయి.

Tags:    

Similar News