Health: నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చాలా డేంజర్‌.. ఎందుకంటే..?

Health: నేటి కాలంలో ప్రజల ఆహారం, జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి.

Update: 2022-07-07 06:30 GMT

Health: నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చాలా డేంజర్‌.. ఎందుకంటే..?

Health: నేటి కాలంలో ప్రజల ఆహారం, జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. సమయాభావం కారణంగా చాలా మంది కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. మీరు ఆహారం పట్ల శ్రద్ధ వహించకపోతే అనేక జీవనశైలి రుగ్మతలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఒకటి. ఇది చాలా ప్రమాదకరం. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాల్ తీసుకోని వ్యక్తులలో వస్తుంది. ఈ సమస్యలో వ్యక్తి ఆహారం కారణంగా అతని కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల కాలేయం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. పొత్తికడుపులో వాపు, అరచేతులు ఎర్రబడటం, కళ్ళతో సహా చర్మం పసుపు రంగులోకి మారడం, ఇవన్నీ నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్‌ లక్షణాలు. శరీరంలో కోలిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాలేయంలో ఉన్న కొవ్వును జీర్ణం చేయడానికి పని చేస్తుంది. దీంతో పాటు ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆహారంలో కోలిన్ ఉన్న వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

కోలిన్ ఉత్తమ మూలం గుడ్లు. మీరు ఆహారంలో గుడ్లను చేర్చుకుంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి దూరంగా ఉండవచ్చు. కాల్చిన సోయాబీన్స్‌లో కోలిన్‌ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. అందుకే సోయాబీన్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాదు ఈ వ్యాధి సోకినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఆలస్యమైతే చాలా ప్రమాదకరం.

Tags:    

Similar News