Health Tips: ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోందా.. ఈ ఒక్క పండు తింటే చాలు..!
Bad Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే.. కచ్చితంగా తినే ఆహారంలో మార్పులు చేయాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Bad Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే, దానిని డేంజర్ బెల్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే దీని కారణంగా, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీకు కొలెస్ట్రాల్‌కు సంబంధించిన సమస్య ఉంటే, మీ ఆహారంలో కచ్చితంగా మార్పులు చేయాల్సిందే. అలాంటి ఆహారాలను చేర్చడం వల్ల ఒంట్లో పేరుకపోయిన కొవ్వును క్రమంగా తగ్గించుకోవచ్చు. ఇందులో యాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలో యాపిల్‌ను చేర్చడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
యాపిల్స్ తింటే కొలెస్ట్రాల్‌కి చెక్ పడినట్లే..
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి యాపిల్స్ తినడం ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. యాపిల్‌లో ఉండే పెక్టిన్ ఫైబర్ ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందట.
యాపిల్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తుంటారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది బరువును తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఆపిల్ ఎప్పుడు, ఎలా తినాలి?
చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఓ యాపిల్ తినాలి. క్రమం తప్పుకుండా ఇలా తినడం వల్ల కొవ్వును తగ్గించుకోవచ్చు.