Health Tips: అప్పుడప్పుడు ఇలా చేస్తే టాక్సిన్స్ సమస్య ఉండదు..!
Health Tips: అప్పుడప్పుడు ఇలా చేస్తే టాక్సిన్స్ సమస్య ఉండదు..!
Health Tips: కరోనా తర్వాత అందరు ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. వివిధ రకాలుగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. అలాగే శరీరంలోని టాక్సిన్స్‌ని కూడా బయటికి పంపాలి. దీనికోసం కొన్ని రకాల ఆహారాలు తినడం, కొన్ని 'క్లెన్సింగ్' జ్యూస్‌లు తాగడం వల్ల విషపదార్ధాలను తొలగించవచ్చు. బరువు కూడా తగ్గుతారు. అయితే శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేయడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
డిటాక్స్ అంటే ఏమిటి?
శరీరం నుంచి విషపదార్థాలని తొలగించడాన్ని డిటాక్స్ అంటారు. దీనికోసం ఉపవాసం మంచి పద్దతి. ఇది శరీరంలోని ఎలాంటి టాక్సిన్స్‌నైనా బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా రసాలు లేదా పండ్లను తీసుకుంటారు. దీని వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందుతాయి. శరీరం మొత్తం శుభ్రంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
1.ప్రతి భోజనం తర్వాత అర అంగుళం అల్లం తినాలి.
2.భోజనం తర్వాత 100 అడుగులు నడవాలి.
3.సూర్యాస్తమయం తర్వాత రాత్రి భోజనం చేయాలి.
4.పండ్లను ఇతర ఆహారంతో కలిపి తినకూడదు.
5.తేనెను వేడి చేయవద్దు
6.ఇతర పండ్లు లేదా ఆహార పదార్ధాలతో పాలు కలపవద్దు.