Eye Problems: తల్లిదండ్రులకి గమనిక.. పిల్లల్లో కంటి సమస్యలకి కారణాలు ఇవే..!

Eye Problems: ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా గాడ్జెట్‌లు, ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లలో వీడియో గేమ్‌లు ఆడటానికి ఇష్టపడుతున్నారు.

Update: 2022-10-29 12:30 GMT

Eye Problems: తల్లిదండ్రులకి గమనిక.. పిల్లల్లో కంటి సమస్యలకి కారణాలు ఇవే..!

Eye Problems: ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా గాడ్జెట్‌లు, ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లలో వీడియో గేమ్‌లు ఆడటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడపడం వల్ల దృష్టిలోపానికి గురవుతున్నారు. కంటి చూపు బలహీనంగా ఉన్నప్పుడు కళ్లలో నొప్పి, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు నిరంతరం స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడిపినప్పుడు చిన్న వయస్సులోనే అద్దాలు వస్తాయి. తల్లిదండ్రులు పిల్లలను మొబైల్ ఫోన్లు లేదా టీవీ చూడటాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ పద్దతులని అలవాటు చేయాలి. లేదంటే చాలా సమస్యలు మొదలవుతాయి.

పిల్లల ఆహారంపై శ్రద్ధ

ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కళ్లు బలహీనపడతాయి. పిల్లల ఆహారంలో విటమిన్లు A, C, E, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతాయి. దీని కోసం మీరు పిల్లల ఆహారంలో క్యారెట్, బ్రోకలీ, బచ్చలికూర, స్ట్రాబెర్రీ, చిలగడదుంపలను చేర్చుకోవాలి.

గాడ్జెట్‌లకు దూరంగా ఉండాలి

పిల్లల కళ్లకు గాడ్జెట్‌లు ఎక్కువ హాని కలిగిస్తాయి. ఇవి పిల్లల కళ్లను బలహీనపరిచేలా పనిచేస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువ గాడ్జెట్లను ఉపయోగించడానికి అనుమతించకూడదు. పిల్లలతో కొన్ని మైండ్ గేమ్‌లు ఆడేలా అలవాటు చేయాలి. కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన భాగం. కళ్ళ ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు చెకప్ తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల ఎలాంటి సమస్యనైనా తొలిదశలోనే తొలగించుకోవచ్చు. వైద్యుల ప్రకారం కంటి పరీక్ష ప్రతి 6 నెలలకు తప్పనిసరిగా చేయాలి. అందుకే త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల క‌ళ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్షించాలి. అంతేకాదు పిల్లల ఆహారంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండేలా చూడాలి.

Tags:    

Similar News