Cough Problem: జలుబు తక్కువైనా దగ్గు తగ్గడం లేదా.. ఇలా ఎందుకు జరుగుతుందంటే..?

Cough Problem: సీజన్‌ మారినప్పుడల్లా జలుబు, దగ్గు కామన్‌గా వస్తుంటాయి.

Update: 2024-03-10 02:30 GMT

Cough Problem: జలుబు తక్కువైనా దగ్గు తగ్గడం లేదా.. ఇలా ఎందుకు జరుగుతుందంటే..?

Cough Problem: సీజన్‌ మారినప్పుడల్లా జలుబు, దగ్గు కామన్‌గా వస్తుంటాయి. కానీ కొన్ని రోజులకు జలుబు తక్కువవుతుంది కానీ దగ్గు తగ్గకుండా కొన్నివారాల పాటు కంటిన్యూస్‌గా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చాలామందికి తెలియదు. వాస్తవానికి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది చాలా సాధారణ విషయం. ఒక అధ్యయనం ప్రకారం 11% నుంచి 25% మంది పెద్దలు జలుబు తర్వాత దగ్గుతో బాధపడుతున్నారు. ఈ దగ్గు 3 నుంచి 8 వారాల వరకు ఉంటుంది. దీనిని పోస్ట్-ఇన్ఫెక్షన్ దగ్గు అని పిలుస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఇది ఎక్కువగా సంభవిస్తుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

నిజానికి ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో వాపు పెరగడం వల్ల దగ్గు వస్తుందని ఈఎన్‌టీ డాక్టర్లు చెబుతున్నారు. అధ్యయనాల ప్రకారం ఈ వాపు శ్లేష్మం ఏర్పడే ప్రక్రియను పెంచుతుంది. కరోనా వచ్చిపోయిన తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. అయితే ఇన్ఫెక్షన్ తర్వాత దగ్గు సాధారణంగా అందరిలో వస్తుంది. కానీ ఇది అంత తీవ్రమైన సమస్య మాత్రం కాదని చెబుతున్నారు. ఈ పరిస్థితిలో యాంటీబయాటిక్స్ లేదా స్టెరాయిడ్స్ వాడకూడదు. చాలా సందర్భాలలో ఈ దగ్గు ఎటువంటి ఔషధం లేకుండా దానికదే నయమవుతుంది.

తీవ్రమైన దగ్గుని గుర్తించండి

పోస్ట్-ఇన్ఫెక్షన్ దగ్గు సాధారణంగా పొడి దగ్గు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పితో కూడిన దగ్గు ప్రమాదకరమైనది. కఫంలో రక్తస్రావం కావడం, మింగడంలో ఇబ్బంది, నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి పీల్చుకోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఇలాంటి లక్షణాల విషయంలో ఛాతీ ఎక్స్-రే అవసరం అవుతుంది. దగ్గు 8 వారాల కంటే ఎక్కువగా ఉంటే తీవ్రమైన లక్షణాలను గమనించినట్లయితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే చాలా ప్రమాదంలో పడతారని గుర్తంచుకోండి.

Tags:    

Similar News