Eating Curd: పరగడుపున పెరుగు తింటే షాకింగ్‌ ప్రయోజనాలు.. అవేంటంటే..?

Eating Curd: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేస్తాం. ఇందుకోసం మంచి డైట్ పాటించాలి.

Update: 2023-07-14 01:30 GMT

Eating Curd: పరగడుపున పెరుగు తింటే షాకింగ్‌ ప్రయోజనాలు.. అవేంటంటే..?

Eating Curd: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేస్తాం. ఇందుకోసం మంచి డైట్ పాటించాలి. లేదంటే రకరకాల వ్యాధులకి గురికావాల్సి ఉంటుంది. నేటి రోజుల్లో జీవనశైలి గాడి తప్పడంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి కారణం చెడ్డ అలవాట్లే. కొంతమంది ఉదయాన్నే టీ తాగి రోజుని ప్రారంభిస్తారు. కానీ టీ ఆరోగ్యానికి మంచిదేనా అని తెలుసుకోరు. అందుకే ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవడం ఉత్తమం. ప్రతిరోజు ఉదయం పూట పెరుగు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాం.

జీర్ణవ్యవస్థ శుభ్రంగా

పెరుగులో శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. ఇవన్ని ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ పొట్ట సంబంధిత సమస్యలను నయం చేస్తాయి. అందువల్ల కడుపుకు సంబంధించిన సమస్య ఉంటే ప్రతిరోజూ పెరుగు తినడం అలవాటు చేసుకోవాలి.

బరువు తగ్గుతారు

ఈరోజుల్లో చాలామంది అధిక బరువుని తగ్గించుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఇలాంటి వారు ఉదయాన్నే పరగడుపున పెరుగు తినాలి. ఇందులో ఉండే ప్రొటీన్లు పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. దీని కారణంగా చాలాసేపు ఆహారాన్ని తినకుండా ఉంటారు. దీంతో బరువు తగ్గడం మొదలవుతుంది.

ఎముకలు పటిష్టం

పెరుగు తినడం వల్ల బోలు ఎముకల వ్యాధిని తగ్గించవచ్చు. పెరుగులో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు అవసరం. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News