పచ్చిఉల్లిపాయ ఎక్కువగా తింటున్నారా.. జాగ్రత్త ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు..

Raw Onion: కొంతమందికి ఉల్లిపాయలు అంటే మక్కువ ఎక్కువ. ఇష్టంగా తింటారు. స్ట్రీట్‌ ఫుడ్‌లలో ఉల్లిపాయ విరివిగా వాడుతారు.

Update: 2021-12-16 16:30 GMT

పచ్చిఉల్లిపాయ ఎక్కువగా తింటున్నారా.. జాగ్రత్త ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు..

Raw Onion: కొంతమందికి ఉల్లిపాయలు అంటే మక్కువ ఎక్కువ. ఇష్టంగా తింటారు. స్ట్రీట్‌ ఫుడ్‌లలో ఉల్లిపాయ విరివిగా వాడుతారు. ఇది లేకుండా ఏ ఆహారం తయారుకాదు. ఇంట్లో కూరలలో కూడా ఉల్లిపాయ వేస్తారు. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. మిర్చిలు, బజ్జీలు, పావ్‌బాజీ ఎక్కడైనా సరే ఉల్లిపాయ ఉండాల్సిందే. అడిగి మరి వేసుకొని తింటారు. పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదే అయితే అది పరిమితిలో తింటే మాత్రమే. ఎక్కువగా తింటే సాల్మొనెల్లా వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతారు.

సాల్మొనెల్లా అంటే ఏమిటి?

సాల్మొనెల్లా అనేది ఆహార సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బాక్టీరియా పేగులను ప్రభావితం చేస్తుంది. వివిధ రకాల కడుపు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను సాల్మొనెలోసిస్ అంటారు. ఇది మానవ పేగులలో నివసిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఉనికిని సులువుగా గుర్తించలేం. ఇది ఎక్కువగా పచ్చి లేదా తక్కువగా ఉడకబెట్టిన మాంసం, పౌల్ట్రీ, గుడ్లు లేదా గుడ్డు ఉత్పత్తుల వినియోగం కారణంగా ఏర్పడుతుంది.

సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా వెంటనే కనిపించవు. ఇది అన్ని వయసుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలకు ప్రమాదకరం. చెడిపోయిన పచ్చి ఉల్లిపాయల వినియోగం వల్ల ఇది ఎక్కువగా జరుగుతుంది. తీవ్రమైన సందర్భాల్లో ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా కీళ్ల నొప్పికి కారణమవుతుంది. దీనిని గౌట్ లేదా రైటర్స్ సిండ్రోమ్ అంటారు. అంతే కాదు ఈ బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తే అది మెదడు, వెన్నుపాము కణజాలాలను మీ గుండె, ఎముక మజ్జలను దెబ్బతీస్తుంది.

Tags:    

Similar News