Health Tips: చలికాలం ఈ సూపర్‌ఫుడ్స్‌ తినండి.. వారంలో బరువు తగ్గుతారు..!

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంపై శ్రద్ధ వహించడం అత్యవసరం.

Update: 2023-01-28 12:30 GMT

Health Tips: చలికాలం ఈ సూపర్‌ఫుడ్స్‌ తినండి.. వారంలో బరువు తగ్గుతారు..!

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంపై శ్రద్ధ వహించడం అత్యవసరం. కొన్ని సూపర్‌ఫుడ్‌లు పోషకాల పవర్‌హౌస్‌లు. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అనేక వ్యాధులని నుంచి కాపాడుతాయి. అధిక బరువుని తగ్గిస్తాయి. ఈ సూపర్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే అధిక రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చు. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి సూపర్‌ఫుడ్స్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పెరుగు

పెరుగు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది సూపర్ ఫుడ్స్‌లో ఒకటి. జీర్ణక్రియను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది అతిసారం, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మరోవైపు పెరుగులో కాల్షియం ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతిరోజూ ఆహారంలో పెరుగును చేర్చుకోండి.

ఉసిరికాయ

ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్ విటమిన్-సి, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచుతుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉసిరిని తీసుకుంటే జుట్టు, చర్మ సమస్యల నుంచి బయటపడతారు.

తులసి ఆకులు

తులసి ఆకులలో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సమృద్ధిగా ఉంటాయి. తులసి ఆకులు ఒత్తిడిని తగ్గించడంలో, ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో, గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. అందుకే రోజూ కొన్ని తులసి ఆకులను నమలాలి.

పసుపు

పసుపు ఇంట్లో సులభంగా దొరుకుతుంది. ఇందులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని రోజూ తీసుకోవడం వల్ల నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News