Super Foods: స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సూపర్ ఫుడ్స్.. డైట్‌లో చేర్చితే ఉత్తమ ఫలితాలు..!
Super Foods: నేటి జీవన విధానం వల్ల చాలామంది దంపతులు సంతాన లేమితో బాధ పడుతున్నారు.
Super Foods: నేటి జీవన విధానం వల్ల చాలామంది దంపతులు సంతాన లేమితో బాధ పడుతున్నారు. ముఖ్యంగా యువకులు తక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉండటం వల్ల తండ్రి కాలేకపోతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహార పదార్థాలు, ఆల్కహాల్ , ధూమపానం వల్ల ఈ సమస్యని చాలామంది అనుభవిస్తున్నారు. దీనిని తగ్గించుకోవడానికి ఫెర్టిలిటి సెంటర్‌లు, ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ చాలా డబ్బు ఖర్చుపెడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు ఉండటం లేదు. ఇలాంటి సమయంలో డైట్‌లో కొన్ని రకాల సూపర్ ఫుడ్స్‌ని చేర్చకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సహజసిద్దంగా స్పెర్మ్‌కౌంట్‌ని పెంచుకోవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వ్యక్తులు వాల్‌నట్స్ తినాలి. ఇందులో విటమిన్ ఎ, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచడంలో సహాయపడతాయి. అలాగే ఆయుర్వేదం ప్రకారం మెంతి గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు, యాంటీ-గ్రోత్ పదార్థాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. గుమ్మడి గింజల్లో జింక్, విటమిన్ ఎ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల వీర్యకణాలు ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి.
చేప నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వినియోగం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. పురుషుల్లో ఉండే కొన్ని సాధారణ సమస్యలను చేప నూనెతో పరిష్కరించవచ్చు. విటమిన్ బీ స్పెర్మ్‌కౌంట్‌ను బాగా పెంచుతుంది. వెన్న, గుడ్లు, పాలు, పాల మీగడ, బచ్చలి కూర, కాయధాన్యాలు, తృణ ధాన్యాలలతో బీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నువ్వులు, పొద్దు తిరుగుడు పూవు గింజలు, అల్లంలలో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారపదార్థాలుగా తీసుకోవాలి. సెలీనియం కూడా స్పెర్మ్‌కౌంట్‌ను పెంచుతుంది. చేపలు, పొద్దుతిరుగుడు గింజలు, ఎండ్రకాయలు, రొయ్యలు, పీతలు, బియ్యం, గోధుమలు, ఓట్స్ లలో సెలీనియం ఉంటుంది.