Summer Fruits: వేసవిలో ఈ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
Summer Fruits: వేసవిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎక్కువగా పండ్లు తినాల్సి ఉంటుంది.
Summer Fruits: వేసవిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎక్కువగా పండ్లు తినాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. పండ్ల నుంచి శరీరానికి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. పండ్లు తినడం ద్వారా శరీరం ఫైబర్, రిచ్ యాంటీఆక్సిడెంట్లను పొందుతుంది. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను వేసవిలో తినాలి. మామిడి పండ్ల నుంచి లిచిస్, స్ట్రాబెర్రీల వరకు అనేక సీజనల్ పండ్లు తినాలి. ఇవి మీకు విటమిన్ సి పుష్కలంగా అందిస్తాయి. ఈ పండ్లు చాలా చౌకగా, కాలానుగుణంగా ఉంటాయి. విటమిన్ సి లోపాన్ని తీర్చడానికి మీరు ఏ పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆరెంజ్, నిమ్మకాయ
వేసవిలో మీరు తప్పనిసరిగా నారింజ, నిమ్మకాయలను తీసుకోవాలి. ఇవి సిట్రస్ పండ్ల కిందకి వస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది. వేసవిలో నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
2. మామిడి
మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. సువాసనగల మామిడి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. మీరు ఒక మామిడి నుంచి 122 mg విటమిన్ సి పొందుతారు. అంతే కాకుండా మామిడిలో విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కంటి చూపుకు చాలా మంచిది. మామిడి పండు తింటే బరువు పెరుగుతారనే నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ ఇది బరువును తగ్గిస్తుంది.
3. కివి పండు
కివి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కివి చాలా ఖరీదైన పండు అయినప్పటికీ ఒక కివి మీకు 85 మిల్లీగ్రాముల విటమిన్ సిని అందిస్తుంది. ఇది కాకుండా కివిలో విటమిన్ కె, ఇ పుష్కలంగా లభిస్తుంది. కివీలో మీ ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఇతర పోషకాలు ఉంటాయి.
4. స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలు విటమిన్ సి మంచి మూలం. వీటిలో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సీజనల్ ఫ్రూట్ కాకపోవడం వల్ల ఇది తక్కువగా అందుబాటులో ఉన్నప్పటికీ మీరు ఒక కప్పు స్ట్రాబెర్రీలను తింటే 100 mg విటమిన్ సి లభిస్తుంది.