Health Tips: ఈ పండ్లు తింటే నిత్య యవ్వనంగా కనిపిస్తారు.. అవేంటంటే..?

Health Tips: వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు రావడం సహజమే.

Update: 2022-08-08 14:30 GMT

Health Tips: ఈ పండ్లు తింటే నిత్య యవ్వనంగా కనిపిస్తారు.. అవేంటంటే..?

Health Tips: వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు రావడం సహజమే. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ముఖంపై కనిపించే ముడతలు అదృశ్యమవుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లని తీసుకోవడం ద్వారా ముడతలని నివారించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. అవోకాడో

ఆవకాడో విటమిన్ బి, విటమిన్ ఈ గొప్ప మూలం. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. దీని ద్వారా వృద్ధాప్య ప్రక్రియ మందగించి ముఖంపై ముడతలు రావు. ఇప్పటికే ఉన్న ముడతలు కూడా తొలగిపోతాయి.

2. బొప్పాయి

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులు తయారవుతాయి. బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తాయి. చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

3. బెర్రీ

బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో అనేక రకాల ఫ్లేవనాయిడ్స్‌, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తాయి. విటమిన్ సి ఇందులో లభిస్తుంది. ఇది కొల్లాజెన్‌ను బలపరుస్తుంది. ముడతలు కూడా తగ్గుతాయి.

4. గ్రీన్ టీ

మీరు పాలు, పంచదారతో కలిపిన టీ తాగితే ఇక నుంచి మానెయ్యండి. వెంటనే గ్రీన్ టీ తాగడం ప్రారంభించండి. ఇది బరువును తగ్గిస్తుంది. అంతేకాదు చర్మంపై ముడతలు తొలగిస్తుంది. ఇది కాటెచిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ప్రక్రియలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Tags:    

Similar News