Health Tips: ఈ ఆహారాలు జుట్టుకి అమ్మ వంటివి.. అవేంటంటే..?

Health Tips: పొడవాటి, నల్లటి, దృఢమైన జుట్టును కలిగి ఉండాలనుకోని అందరు కోరుకుంటారు.

Update: 2022-10-24 14:34 GMT

Health Tips: ఈ ఆహారాలు జుట్టుకి అమ్మ వంటివి.. అవేంటంటే..?

Health Tips: పొడవాటి, నల్లటి, దృఢమైన జుట్టును కలిగి ఉండాలనుకోని అందరు కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలోని అది సాధ్యపడటం లేదు. దీని వెనుక అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానికి విటమిన్ సి చాలా ముఖ్యమైన పోషకం. కాబట్టి మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. నారింజ తొక్క

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీంతో తయారుచేసిన హెయిర్ ప్యాక్‌ని తలకు రాసుకుంటే జుట్టు మెరిసిపోయి ఒత్తుగా మారుతుంది. దీని కోసం ముందుగా నారింజ తొక్కను తీసి నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరువెచ్చగా చేసి వీటితో జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరిసిపోవడం ప్రారంభమవుతుంది.

2. ఉసిరి రసం

ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆయుర్వేద నిధి అని చెప్పవచ్చు. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి రసాన్ని జుట్టుకు పట్టిస్తే అది జుట్టుని మూలాల నుంచి బలోపేతం చేస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. చుండ్రు సమస్యని కూడా తగ్గిస్తుంది.

3. నిమ్మరసం

నిమ్మరసం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీని రసాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు సిల్కీగా, మృదువుగా తయారవుతుంది. దీన్ని ఉపయోగించడానికి నిమ్మరసం, ఆవాల నూనె కలిపి జుట్టుకు అప్లై చేయాలి. అరగంట అలాగే ఉంచి చివరగా తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.

Tags:    

Similar News