Health Tips: జిమ్‌కి వెళుతున్నారా.. స్టామినా కోసం ఈ డైట్ ఫాలో కావాల్సిందే..!
Health Tips: కరోనా దెబ్బకి చాలామంది ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు.
Health Tips: కరోనా దెబ్బకి చాలామంది ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఇందుకోసం వ్యాయామం, జిమ్‌లకి ఎక్కువగా వెళుతున్నారు. అయితే ఎక్కువ రోజులు మాత్రం వీటిని కొనసాగించలేకపోతున్నారు. దీనికి కారణం స్టామినా లేకపోవడమే. శరీరంలో ఎటువంటి సత్తువ ఉండదు. కాబట్టి వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస త్వరగా వస్తుంది. ఇది మాత్రమే కాదు 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాయామం చేసిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు, భయానక భావన ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు జిమ్‌కి వెళ్లడానికి స్టామినాను పెంచుకోవాలని ప్లాన్ చేస్తుంటే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం.
బాదం
బాదం పప్పును పోషకాల నిధిగా పరిగణిస్తారు. బాదంపప్పు రోజూ తీసుకోవడం వల్ల స్టామినా పెరుగుతుంది. మరోవైపు ఎముకలు బలంగా మారుతాయి. అంతే కాకుండా రక్తంలో చక్కెర కూడా అదుపులో ఉంటుంది.
అరటిపండు
బరువు పెరిగే విషయానికి వస్తే ముందుగా అరటిపండు పేరు వస్తుంది. కానీ అరటి పండు పెరగడానికి మాత్రమే కాదు ఇందులో ఉండే ఫైబర్, సహజ చక్కెర శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ బి ఇందులో ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువ కాలం శక్తిని ఇవ్వడానికి సహాయం చేస్తాయి.
కాఫీ
శరీర అలసటను తొలగించడానికి కాఫీ ఉత్తమమైనది. కాఫీ తీసుకోవడం వల్ల స్టామినా పెరుగుతుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాఫీ తీసుకోవడం ద్వారా అడ్రిలిన్ హార్మోన్ శరీరం నుంచి విడుదలవుతుంది. ఇది కండరాలకు రక్తాన్ని వేగంగా పంప్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి జిమ్‌కి వెళ్లేవారు రోజూ 2 కాఫీలు తాగాలి.