Green Tomato: ఎరుపు టమోట కాకుండా పచ్చి టమోట తినండి.. ఈ సమస్యలు తొలగిపోతాయి..!

Green Tomato: ఎరుపు టమోట కాకుండా పచ్చి టమోట తినండి.. ఈ సమస్యలు తొలగిపోతాయి..!

Update: 2022-12-01 05:52 GMT

Green Tomato: ఎరుపు టమోట కాకుండా పచ్చి టమోట తినండి.. ఈ సమస్యలు తొలగిపోతాయి..!

Green Tomato: నిత్యం వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ టమోట. ఇంట్లో వంటకమైనా, వీధిలో ఫాస్ట్ ఫుడ్ అయినా టమోటా ఉండాల్సిందే. ఇది లేకుంటే ఏదైనా అసంపూర్తిగా ఉంటుంది. అయితే ఎరుపు టొమాటోలను సూప్‌లు, సాస్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడైనా పచ్చి టమోటాలు తినడానికి ప్రయత్నించారా.. దీని వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. పచ్చి టమాటాలో పోషకాలకి కొదవలేదు. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

కరోనా వైరస్ యుగంలో రోగనిరోధక శక్తిని పెంచడంపై అందరు దృష్టి సారించారు. పచ్చి టమోటాలను క్రమం తప్పకుండా తింటే శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం రాకుండా కాపాడుతుంది.

కళ్ళ ఆరోగ్యం

గ్రీన్ టొమాటోలను రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇది కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల కంటి పనితీరు సక్రమంగా జరుగుతుంది. కంటి చూపు పెరుగుతుంది.

రక్తపోటును నియంత్రణ

ప్రస్తుత కాలంలోని గజిబిజి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం చాలా పెరుగుతోంది. దీని కారణంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితిలో ఆకుపచ్చ టమోటాలు తినడం చాలా అవసరం. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల బీపీని అదుపులో ఉంచుతుంది.

Tags:    

Similar News