Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? మీరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నట్లే

Fatty Liver Disease: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది ఫ్యాటీ లివర్‌ బారిన పడుతున్నారు.

Update: 2024-06-08 06:18 GMT

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? మీరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నట్లే

Fatty Liver Disease: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది ఫ్యాటీ లివర్‌ బారిన పడుతున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం కారణం ఏదైనా ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. శరీరంలో కీలక భాగాల్లో ఒకటైన కాలేయం పనితీరు దెబ్బతింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా శరీరంలోన వ్యర్థాలను తొలగించడంలో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే ఫ్యాటీ లివర్‌ సమస్యను కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ సమస్యను త్వరగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదాల నుంచి బయటపడొచ్చు. ఇంతకీ ఫ్యాటీ లివర్‌ను ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్‌ సమస్య ప్రారంభంకాగానే కనిపించే లక్షణాల్లో మూత్రం రంగు మారడం ప్రధాన లక్షణాల్లో ఒకటి. కాలేయంలో ఎలాంటి సమస్యలున్నా మొదట మూత్రం రంగు మారుతుంది. దీర్ఘకాలంగా మూత్రం రంగులో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఒక్కసారిగా బరువు తగ్గడం కూడా ఫ్యాటీ లివర్‌ ముందస్తు లక్షణమేనని నిపుణులు చెబుతున్నారు. అకారణంగా బరువు తగ్గుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తే కనిపించే మరో ప్రధాన లక్షణాల్లో పొత్తికడుపులో ఇబ్బంది ఒకటి. పొత్తి కడుపులో నొప్పిగా ఉన్నా, భారంగా అనిపిస్తున్నా కాలేయం పనితీరులో ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక ముఖం ఉబ్బినట్లు కనిపించినా ఫ్యాటీ లివర్‌ సమస్యగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మంపై కనిపించే కొన్ని లక్షణాలు కూడా ఫ్యాటీ లివర్‌కు ముందస్తు లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్‌ కారణంగా మెడ దగ్గర చర్మం నల్లగా మారడం, చర్మంపై ముడతలు ఏర్పడుతాయని అంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నట్లయితే జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి వర్కవుట్స్‌ చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు, బేకరీ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా మద్యం సేవించే అలవాటు ఉన్న వారు పూర్తిగా మానేయాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు, సలహాలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News