Vitamin C: విటమిన్ 'సి' లోపం వల్ల ఈ వ్యాధులు చుట్టుముడుతాయి.. నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం..!

Vitamin C: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందాలి.

Update: 2023-06-08 13:00 GMT

Vitamin C deficiency: మన శరీరానికి విటమిన్ సి ఎందుకు అవసరం?రోజుకు ఎంత అవసరం?అసలు నిజం చెప్పిన వైద్యులు

Vitamin C: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందాలి. లేదంటే పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు శరీరం పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి. విటమిన్ సి శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్‌. దీని లోపం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. విటమిన్ సి లేకుంటే ఎలాంటి వ్యాధులు సంభవిస్తాయో ఈరోజు తెలుసుకుందాం.

మధుమేహం

విటమిన్ సి లోపం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి.

గుండె జబ్బులు

విటమిన్ సి లోపం గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇది లేకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

రక్తం లేకపోవడం

రక్తం లేకపోవడం రక్తహీనతకు దారితీస్తుంది. విటమిన్ సి శరీరంలో ఐరన్‌ గ్రహించడానికి సహాయపడుతుంది. దీనిలోపం ఉంటే రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ రక్తహీనత ఉంటే ఐరన్‌తో పాటు విటమిన్ సి పుష్కలంగా తీసుకోవాలి.

నోటి సమస్య

విటమిన్ సి లోపం వల్ల దంతాలు, చిగుళ్ళు బలహీనపడతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్‌ పెరుగుతుంది. గాయాలు మానకుండా ఉంటాయి.

న్యుమోనియా

శరీరంలో తగినంత విటమిన్ సి లేకపోతే న్యుమోనియా సమస్య ఎదురవుతుంది. మీరు ఇప్పటికే న్యుమోనియా బారినపడి ఉంటే విటమిన్ సి పదార్థాలను అధికంగా తీసుకోవాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News