Health Tips: చలికాలం తక్కువ నీరు తాగుతున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

* ఈ వాతావరణంలో కిడ్నీలు ఎక్కువ మూత్రాన్ని వడబోస్తాయి. అందుకే చెమట పట్టకపోయినా తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు.

Update: 2022-12-07 01:38 GMT

చలికాలం తక్కువ నీరు తాగుతున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

Health Tips: వేసవిలో చాలా దాహం వేస్తుంది. వేడివల్ల ప్రజలు బయటికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. కానీ శీతాకాలంలో అలా ఉండదు. వాతావరణం చల్లగా ఉంటుంది. అంతమాత్రాన నీటి వినియోగాన్ని తగ్గించాలని మాత్రం కాదు. చలికాలం శరీరం లోపలి వాతావరణం వేడిగా ఉంటుంది. దీని కారణంగా నీటి కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ వాతావరణంలో కిడ్నీలు ఎక్కువ మూత్రాన్ని వడబోస్తాయి. అందుకే చెమట పట్టకపోయినా తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు.

డీహైడ్రేషన్ ప్రమాదం

శరీరానికి కావల్సినంత నీరు అందకపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. చాలా అధ్యయనాల ప్రకారం తక్కువ నీరు తాగే వ్యక్తులు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మూత్రపిండాల్లో రాళ్లు, యూరిన్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. డీ హైడ్రేషన్‌ వల్ల వాపులు, ధమనుల గట్టిపడటం, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది. రోజువారి నీటి అవసరం అనేది పర్యావరణం, ఉష్ణోగ్రత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

మీరు అథ్లెట్ అయితే ప్రతిరోజూ 4 గంటల పాటు వర్కవుట్ చేస్తే ఎక్కువ నీరు అవసరం. ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం మహిళలు ప్రతిరోజూ 2.7 లీటర్ల నీరు తాగాలి. పురుషులు ప్రతిరోజూ 3.7 లీటర్ల నీరు తాగాలి. చలికాలంలో చల్లటి నీరు మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. కానీ బాగా చల్లగా ఉంటే గోరువెచ్చని నీరు తాగండి. ఇది హైడ్రేటెడ్ గా ఉండటానికి కేలరీల వినియోగాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది.

Tags:    

Similar News