Lifestyle: మీక్కూడా ఈ అలవాట్లు ఉన్నాయా.? త్వరగా ముసలివాళ్లవుతారు

Lifestyle: నిత్యం యవ్వనంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇది అందరికీ సాధ్యమా.. అంటే కచ్చితంగా కాదని చెప్పలేము.

Update: 2024-06-12 01:30 GMT

Lifestyle: మీక్కూడా ఈ అలవాట్లు ఉన్నాయా.? త్వరగా ముసలివాళ్లవుతారు

Lifestyle: నిత్యం యవ్వనంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇది అందరికీ సాధ్యమా.. అంటే కచ్చితంగా కాదని చెప్పలేము. ఇది ప్రకృతికి విరుద్ధం కూడా. అయితే కొన్ని సందర్భాల్లో మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల కారణంగా చిన్న వయసులోనే ముసలివాళ్లలా కనిపిస్తుంటారు. జీవనవిధానంలో మనం చేసే ఆ పోరపాట్లు ఏంటో నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన పరిశోధనల్లో రుజువైంది.

చిన్న వయసులోనే వయసు మళ్లినట్లు కనిపించడానికి గల ప్రధాన కారణాల్లో తక్కువగా నీరు తీసుకోవడం ఒకటని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని, ముఖ్యంగా చర్మం ముడతలు పడడం వంటి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అలాగే శరీరంలో నీటి కొరత ఉండడం వల్ల అధికరక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రక్తంలో సోడియం స్థాయిలు పెరగడం కూడా వృద్ధాప్య ఛాయలు కనిపించడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఉప్పు అధికంగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇదేదో అషామాషీగా చెప్పిన విషయం కాదు. సుమారు 11 వేల మందికిపైగా పరిగణలోకి తీసుకొని వారి నుంచి వివరాలు సేకరించి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. 45 నుంచి 66 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇందుకోసం ఎంచుకున్నారు. వీరందరి రక్తంలో సోడియం స్థాయిని పరీక్షించగా, అది చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

దీంతో వీరందరి శరీరంలో నీటి కొరత ఏర్పడినట్లు వెల్లడైంది. రక్తంలో సోడియం అధికంగా ఉండటం చాలా ప్రమాదకరమని పరిశోధనలో వెల్లడైంది. అలాంటి వారికి వయసు రాకముందే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని అంటున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే తగినంత నీరు తీసుకోవాలని నిపునులు చెబుతున్నారు. దీని వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది, అలాగే సోడియం స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా దాహం లేకున్నా కచ్చితంగా తగినంత నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Tags:    

Similar News