Cashew Milk: నిద్రలేమికి చక్కటి మందు జీడిపప్పు పాలు.. ట్రై చేసి చూడండి..
Cashew Milk: ఒక వ్యక్తికి నిద్ర చాలా ముఖ్యం. అది లేనిదే వారు ఏ పనిచేయలేరు. దేనిమీద దృష్టి సారించలేరు. తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారు.
Cashew Milk: ఒక వ్యక్తికి నిద్ర చాలా ముఖ్యం. అది లేనిదే వారు ఏ పనిచేయలేరు. దేనిమీద దృష్టి సారించలేరు. తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారు. శరీర అవయవాల పనితీరు మందగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కచ్చితంగా మంచి నిద్రపోవాలి. అప్పుడే మరునాడు హుషారుగా ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అలాంటివాటికి చెప్పడానికి మీకు ఈ చిట్కా చక్కగా సరిపోతుంది. అదేంటో చూద్దాం.
మీరు మంచినిద్ర కోసం జీడిపప్పు పాలని ట్రై చేయవచ్చు. ఖర్చు తక్కువ ప్రయోజనం ఎక్కువ. రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చని జీడిపప్పు తాగితే నిద్ర కమ్ముకొస్తుంది. జీడిపప్పుతో సహా అనేక డ్రై ఫ్రూట్స్ నిద్రకు చాలా మంచివిగా భావిస్తారు. ఇందులో మెలటోనిన్తో పాటు మెగ్నీషియం, జింక్ వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. పరిశోధన ప్రకారం జీడిపప్పు పాలు నిద్రలేమి సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు మంచి నిద్ర కోసం కష్టపడుతున్నట్లయితే ఎల్లప్పుడూ జీడిపప్పు పాలను తీసుకోవచ్చు. అయితే వాటిని ఎలా తయారుచేయాలో చూద్దాం.
3నుంచి4 జీడిపప్పులను తీసుకుని కప్పు పాలలో నానబెట్టాలి. వాటిని 4 నుంచి 5 గంటలు నాననివ్వాలి. తర్వాత వాటిని మెత్తగా దంచాలి. ఈ పేస్ట్ని పాలలో వేసి దానికి కొంచెం చక్కెరను కలిపి కాసేపు మరిగించాలి. తర్వాత కొంచెం చల్లార్చి గొరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే సరిపోతుంది. ఈ పానీయం తయారు చేసిన తర్వాత, నిద్రవేళలో ఖచ్చితంగా తాగాలి. ఇది మీకు బాగా నిద్రపోవడానికి మరుసటి రోజు హుషారుగా ఉండటానికి శక్తినిస్తుంది.